| దేశి సాహిత్యము | స్త్రీల పాటలు | శ్రీకృష్ణుని చల్దులు |
| శ్రీకృష్ణుని చల్దులు |
| సృష్టిలోవెలసినట్టీ - శ్రీ వాసిష్టులెల్ల గొలువా శ్రీకాంతుని వల్లభులకూ - శ్రీమహిమలు విస్తరింత్రూ వేడుక రెండే పదములు - ఉభయాకారుండని పాడా కాళింగమర్దనులకు - ఘనమైన కల్యాణమ్ము పంచ శతకోటియోజన - విస్తీర్ణమైనా పృథివీ ఆత్మారక్షించా ఉదయ - మైతిరి రాజీవలోచనులు చెన్నుగ గోపకుమాళ్ళూ - చేకోలలు చేతనుబట్టుక శ్రీకృష్ణా గోవులుగాయను - పోదామా ప్రొద్దునలేచి అని విన్నపములు సేయగ - అచ్యుతులూ మేలుకాంచ్రీ అవధరింపుతులేచి - ఆనందమున పొంగీ త్రైలోక్యవల్లభులు - తమతల్లితో అనిరి యిట్లూ గోవులను కాయవలెను - చాలా ప్రొద్దాయెను మాకూ అనుచూ తన పట్టి లేపగ - ఆనందామున గోపీ అఖిలాండనాయకులనూ - అంకించీ పిలచే తల్లీ సకలకల్యాణా నిలయుడ - సకలాగుణ శీలుడ పరంజ్యోతి తేజోనిలయా - బల్లిదుడ మేల్కొనరో శ్రీ పరమాకల్యాణూడా - సృష్టికి కర్తవైనా క్షీరాబ్ధీ శయనుడైనా - తనయుడ మేల్కొనరో అమి వరదా శుభనిలయుడ - ఆనందసాగరూడా ఇందిరానంద కరుడా - యదునందన మేలుకొనరో గ్రాహము తాకిన కొలనా - గజరాజు మకరిచేతా ఆర్తీచే గొలువ భక్తి - ఆలించివిన్నాదేవ పాంచాలీ వలువలు వేగా - దుశ్శాసనుడు సభనొలువా అక్షాయంబుగ వలువల - నొసగిన హరి కృష్ణా పూతకి ప్రాణసంహార - మాకల్లా ఉదయమైతి క్షత్రీయవర్గము లణచిన - పుత్రూడ మేలుకో శశధరుడు అర్జునుడు - దిశలెల్ల దృంచవేసి ఆధారములేక అంతా - వృక్షంబున నుండెనపుడూ కమలాలోచనులు తమరు - కరుణించి తలచనపుడె శరణాగతుల రాజ - చయ్యన మేలుకొనరో మత్స్యావతారమున - అచ్చూగ అసురుని చీరగ చొచ్చి వేదములు నిలిపిన - వేదా వేద్యుడ లెమ్మా కూర్మావతారమున - కొండవీపున ఆని అమరూల కమృత మొసగిన - ఆది కూర్మమలెమ్ము నట్టేడూ సముద్రములు - ధరణీపై కలసీ పార వసుధా కొమ్మున యెత్తిన - వరహావతారుడా అదరీ రక్కసులూ తమరు - బెదర స్తంభమున వెడలి హిరణ్య కశిపుని చంపు - నరసింహావతారుడ లెమ్మీ బాలప్రాయమున తనరు - బలిచక్రవర్తీ నపుడు మూడే పాదమ్ములు అడిగిన - మురవైరి మేలుకో కార్తవీర బాహులు వెయ్యీ - ఖడ్గంబున ఖండించి క్షత్రియ వర్గము గెలిచిన - పరశురామావతారూడా వాలీ మర్దనుడ - వారధి బంధనుడ సుగ్రీవ హితుడవైన - సూర్యవంశుడ మేలుకో సేతూ బంధానుడా - శ్రీలక్ష్మీ వల్లభుడ రావణవైరి వైన - రఘునందన మేలుకొనరొ గోపీనందనుడ - గోవర్ధనోద్ధారుడ గోపికా ప్రాణవల్లభ - గోపాలుడ మేలుకొనరొ హలాయుధమ్ము బూని - అన్నీ తీర్థములు తిరిగి అవలీలగాను వచ్చిన - బలరామావతార లెమ్ము రుద్రునికి త్రిపురములు - అగ్గాళమయ్యెనంత మగనాళ్ళ మానము గొన్న - బుద్ధావతారుడ కాళంగి మర్దనూడ - కౌస్తుభ హారమువేసి కలియుగ దుష్టుల జంపిన కలికావతారుడ అమి వరదా శుభనిలయుడా - ఆనంద యోగనిద్ర ఎప్పూడు మేల్కొంటిరి - ఇదుగో గోపకుమాళ్ళు అనుచూ తిరుబోనం దెరచీ - చల్లారబోసెను చల్దీ దధిచాల శొంఠీ వేసి - మృదువుగా కలిపెను చల్ది ఓ యమ్మా కలిపెను చల్ది - ఒప్పా చిక్కములోనుంచీ మృదువైనా పచ్చళ్ళన్నీ - చల్దీపై నుంచెను తల్లి వాక్కాయ వద్దికాయ - వొప్పైన మామిడికాయ వూరీన అల్లంతోను - వుసిరీ కాయను వుంచె చల్లించిన మిరియపు గెలలూ - జన్మువుల పెరుగులతోను అల్లమ్ము ఆవకాయ - అనేకం వుంచెను తల్లి చెన్నూ భావించీ చూచి - శిరిపాదములు కడిగీ ముద్దుతో ఒప్పునట్లూ - ముఖపద్మ మొనరించె నారి కేశవు కురుల - తలదువ్వి పాపిటతీసి - కొప్పూ వొప్పుగ ముడిచే చేమంతులు చంపాకములు - చెంగల్వలు నడుమనుంచే అతివీరులైనా మల్లెలు - అనేకం ముడిచెను తల్లీ వొప్పూగ కమల నేత్రి - ఉభయా భాస్కరులకు బాగుగా చందనమ్ము - బలచందనం అలదే కడువొప్పు పాదములకు - గండూ కడియములుంచె కనకంపు గజ్జెలు గట్టి - ఘనమైన తొడుగులుంచె మెరుగూ మొలనూళ్ళ బెట్టె - మేలైన సొమ్ములు బెట్టె అంగుళీయ ముద్రికలు - మురవైరి కొప్పబెట్టె వజ్రాగోమేధిక పతకం - వైడూర్య రత్నాఖచితం సువర్ణపతకం కృష్ణుని - కంఠమున నుంచెను తల్లీ పచులేని పచ్చాబొట్టు - బాగుగా దిండే జుట్టీ భమిడీకాదారీ దోపే - తొమ్మండుగురు వెంటా నడువ బాగుగా మళ్ళీచూచె - బంగారం వొప్పె బిరుదూ నందూని సుతుడూ వెడలె - గోవులకాతా మనుచు చిలకాలు పలికేటి మోత - గోవుల కొమ్ముల మోత గోవుల తరిమెడి మోత - కాంతలు పాడే మోత కోవిలాలు కూసెటి మోత - పుంజూలు కూసెటి మోత నెమళ్ళు ఆడెడి మోత - నెమళ్ళు కూసెటి మోత నాల్గోజామాయెను పొద్దూ - నాధునికి విన్నాపములు ఎత్తీ మూడెత్తుల మోత - ఉభయ పార్శ్వములయందు ఏమీ భాగ్యము గలిగె - ఈమంద జనమువారికి త్రైలోకదాతా పతికి - తల్లి యశోదాదేవికి సర్వేశ్వరుడు పట్టినవేణు - సంచారింపుచు విన్న మాత్రశ్రీ కార్యము - తలచినమోతా అనుచున్న దేవగణంబులు - గగనమార్గములయందు పుష్పంబులు వృష్టికురిసెను - పుండరీకాక్షులమీద యక్షాకిన్నర గరుడ - గంధర్వ విద్యాధరులు తుంబూరు నారదూలు - స్తుతియించి మిమ్ము గొలువ చెంగలి గడ్డిమేసి - చేకొనుచు గోధనమంతా యిందిరపతి వద్దకువచ్చె - మందల్ల నడుమనిలిచె చిటిచిట్టీ లేగాలన్నీ - చెవులు రిక్కించి చూచి చెలువూనీ జేరవచ్చె - శ్రీ వేణునాదంబులకు చిక్కంబున చల్దీదింపె - చొక్కంబుగ వెండీవలెను అగ్రజులు అందీ ముద్దలు - అందంది వేయువారు పడులేని పచ్చళ్ళన్నీ - వుంగ్రాలు ఎగసనదోసుకు వొప్పైన పచ్చళ్ళన్నీ - వేళ్ళనడుమనువేయ బాలచంద్రుని చుట్టు - చాల పరివేషంవలెను కూడెదరు గోపకుమాళ్ళు - మేలుగా ఒప్పేభక్తి ప్రభాతసమయా మప్పుడు - భాస్కరులు ఉదయమవగ బ్రహ్మాండ కోట్లు వెలగ - ప్రభుడూ చలిదారగించె మవునంబున ఆరగించెను - మధుసూదన హస్తములకు పన్నీరు అవధరించెను - త్రైలోక్య వల్లభూడు పచ్చీ పోకలతోను - పండుతెల నాకులతోను పచ్చకర్పూర విడియం - పరమాత్ము డవధరించె అమరాంగనలు వచ్చి సంభ్రమమున విమా - నారూఢులై బ్రోవ ఆలంకమధ్యమమున భ్రమతూలై వారలు జూచితె పంచశతకోటి - విభ్రాంతులై కల్పవృక్షముల నీడను కడుతిన్నగ మళ్లీజూచి కమలానాభులు వేణు - బట్టెను కాంతలా చిత్తమమరా మలహరి ఘూర్జరి పురమందున నో చిలుకా - పలికిన మాధవుండు దేశాక్షి భోజగమన సావేరి భూపాలమునా - సరసిజ శ్రీరాగా సర్వంబున నాదముబుట్టే - సనకాదులు అంజలిబట్ట సతులూ తమ సుతులను వీడీ సర్వేశ్వరును తగులుకురాగా అందారు గొల్లలు గూడీ - ఆలోచనలు సేయుచుండ్రీ పెద్దావాడందదు గొల్ల - పేదరికం తెలిపెను కృష్ణుడు పండావాడందురు గొల్లా - పాపంపు మాటలాడ సతినైనా యిచ్చేగాని - సావంగనోపననెను బింక్కంపు పరుడో గొల్ల - బిరుదూ పాటించీ చూసీ సతినిచ్చే కష్టంకంటె - చచ్చుండుట మేలని పలికె వివేకపరుడో గొల్ల - వివరించి తెలిపెద మీకు మన మెవ్వరు మన సతులెవ్వరు - మధురాపురి కేగుద మనిరి తల్లీ తండ్రీ కృష్ణుడు - దాతా దైవము గురువు అచ్యుతుడె మన కందరికీ - ఆత్మాబంధుడని బలికె కస్తూరి చుక్కచేది - కన్నులా కాటుకబెట్టీ కస్తూరి ఒక చెలియా - కలయంగా పూసుకువచ్చె వొచ్చేనని వొక చెలితాను - హెచ్చూగ హారంతూల వచ్చేనని ఒక చెలిపేరు - గుచ్చార వేసుకొనుచు కురులూ కుచములుగదల - బరువేణి అమ్ములు గదల జలజాక్షి కృష్ణుని జూచి - నిలువూ నిలుమని బలికె కనుగీటుచు కృష్ణుడు నందన - వనము లొపాలకు వచ్చీ కనకామండపమున - కాంతా తెమ్మని బలికె తెస్తీనిదేవర యిది ఒక - పూర్వాజన్మ ఫలమున దొరకేనని పరుగూనా - వచ్చెచెలి వెన్నూడి వేణునాదం - చదివీన విన్నా వారికి సాయుజ్య పదవీగలదు - సంసార భీతితొలగు ప్రభాత సమయమప్పుడు - భాస్కరూడూ రాగ ప్రభు నీ చలికోలలు మహిమలు - చదివీన విన్నా వారికి సాయుజ్య పదవీ గలదు - సంసార భీతీ తొలగు |