పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ప్రథమాశ్వాసము
ఆశ్వాసాంతము
ఉ. సంగవిదూరతాకలిత! శాంతరసస్ఫుటరోహ దిద్ధబో
ధాంగ! సమాశ్రితాపదుదయ జ్వలన ప్రశమప్రవర్తకా
పాంగమరీచిరూప వితతామృత వీచి విహార! వాసవో
త్సంగతలోపలాల్య పద! సంసృతివారణ! దైత్యదారణా.
403
క. ఆశ్చర్య కరణ కరుణా! | నిశ్చల శుచిహృదయ భావనీయ విహరణా!
పశ్చిమనాడీ సరణ! పు | రశ్చరణధ్యేయ! భక్తరమణ విధేయా!
404
మాలిని ప్రణవమయ గరిష్ఠోపాయ సంవేద్యభూమా!
భణన మనన దూరస్ఫార విస్తార సీమా!
గుణవిభవ నిరాసా కుంఠితోల్లాస ధామా!
గణన రహితలీలా! కల్ప నిత్యాభిరామా!
405
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమదాంధ్ర మహాభారతంబున శల్యపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. 406
శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )