| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
ఆ సమయంబున నర్జునుఁ డచటికి | నేతెంచి వైభవ మెసకమెసఁగఁ బ్రాలంబమాలికాపంక్తులఁ గదళికా | స్తంభంబులను శాతకుంభకలశ శిఖరంబులను బెంపుఁ జెలువును విలసిల్ల | యానంబు గల్పించి యాదవేంద్రు శవము సుస్నాతంబుఁ జందనచర్చాస | మేతంబుఁ జీనాంబరాతి శోభి |
|
| తే. |
తంబు నాభరణస్ఫురితంబు మాల్య | యోజితంబునుగాఁ జేసి యాజక ప్ర యుక్తమంత్రతంత్రస్ఫుటయోగ మింపొ | నర్ప నేతెంచె సామగానంబు చెలఁగ. |
141 |
| క. |
విను దేవకియును రోహిణి | యును భద్రయు మదిరయును సముచితవిధానం బున నొనరించిన యానము | లనూన పరికర్మరుచిరలయి యెక్కి తగన్. |
142 |
| క. |
చెలులుం జుట్టలు దాపట | వలపట నేతేరఁ దెలిసి వదనసరోజం బులనొప్పం దగియెడు మా | టల వారల వగలు మాన్పుటలు నుతికెక్కెన్. |
143 |
| క. |
ఆ నృపుని వల్లభలు శవ | యానంబు పిఱుంద నిట్ల యరిగిరి విధి స న్మానితగతి ముందట వి | ప్రానీకము చనియె నుజ్జ్వలాగ్నులు గొనుచున్. |
144 |
| తే. |
ద్వారకావాసు లెల్లను దల్లడంబు | లుల్లములఁ గప్ప మోముల నురుల బాష్ప ధార లతికరుణమున హాహారవంబు | లెసఁగ నేఁగిరి వెనుకను నిరుదెసలను. |
145 |
| సీ. |
ఇమ్మెయిఁ గొని చని యమ్మహీశుఁడు వేడ్క | మెలఁగెడు తోఁటలోపల సమగ్ర చందనాగురు కాష్ఠచయముల మున్న కా | వించిన సొదకు సద్విధియుతముగ నప్పాడె సేర్పించి యర్జునుఁ డయ్యాద | వేంద్రుని పితృమేధ మెల్ల జనులు నభినుతి సేయంగ నచ్చితియం దా శ | వంబు నారోపింపఁ బనిచి యగ్ని |
|
| తే. |
దీప్త మగునట్లు సేయింప దేవకీ ప్ర | ముఖులు నలువురు నప్పు డా శిఖిఁ బ్రవేశ లీల నంగీకరించి రాబాలవృద్ధ | మైన సకల జనంబులు నార్తి నొంద. |
146 |
| క. |
ఘృతములు పైఁ జల్లఁగ న | చ్చితిఁ బేర్చిన సప్తజిహ్వు శిఖల రవము నూ ర్జిత సామగాన నాదో | ద్గతియును హాహారవంబుఁ గలసి చెలంగెన్. |
147 |
| క. |
తదనంతరంబ వజ్రుఁడు | మొదలగు పురుషులు సతీసమూహముఁ దగుమై నుదకప్రదానవిధి య | య్యదుముఖ్యున కాచరించి రన్వయముఖ్యా! |
148 |
| తే. |
అప్పు డందఱ బంధుల నాదరమునఁ | దనదు సముచితాలాపసంతానకలన ననునయించి పురంబున కరిగెఁ దాను | వారు వగ మదిఁ గదుర వివ్వచ్చుఁ డధిప! |
149 |
| తే. |
ఇత్తెఱంగున సత్క్రియాయత్తుఁడైన | యర్జునుఁడు పితృమేధము నభినుతముగఁ జలిపి వృష్ణిభోజాంధకసమరధరణి | తలమునకు బుధజనసహితంబు గాఁగ. |
150 |
| సీ. |
అపరదినంబున నరిగె నప్పుడ వృద్ధ | బాలకాంతాజనప్రకరములకు నని నిర్గతప్రాణులై పడియున్న భో | జు లను నంధకుల వృష్ణులను గలయఁ జూపంగ నుత్కటశోకంబు గదిరిన | నఱిముఱి మేదిని నొఱగువారు విప్రలాపంబు నానాప్రకారంబులఁ | జేయువారును నిరుచేయి నెత్తి |
|
| తే. |
యలఁత నాక్రందనములు హాహారవముల | తో నొనర్చువారును నైన నా నరుండు దద్ద యడలి దారుకు భాషితములఁ దేఱి | యఖిలజనులకు నుపశమ మావహించె. |
151 |
| క. |
తదనంతరంబ రణమృత | యదుసంఘములకు సమంచితానలసంస్కా రదశాపూతత్వము నా | విదితయశుఁ డొనర్చె విప్రవితతి ఘటకుఁడై. |
152 |
| ఆ. |
నిఖిలబంధుజనుల కఖిలమృతులకును | దగఁ దిలోదకప్రదాన మాచ రించునట్లు గాఁగఁ బంచి యలుప్తక్రి | యత్వ మొనర నడపె నక్కిరీటి. |
153 |
| క. |
ఇవ్విధముగ విశ్రుతముగఁ | గవ్వడి నియతుఁ డయి బంధుకార్యము లెల్లన్ నెవ్వగలు దన మనంబున | నివ్వటిలఁగ నాచరించె నృపసంసేవ్యా! |
154 |