| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| క. |
యాదవకుటుంబముల న | త్యాదరమున నట్లు నిలిపి హలధరుఁడును దా మోదరుఁడుఁ దెగుట వారల | గాదిలి పొలఁతులకుఁ జెప్పఁగాఁ దలఁచె మదిన్. |
194 |
| చ. |
తలఁచి యతండు మందగతిఁ దానును నర్హజనోత్కరంబు వా రలకడ కేఁగి శోకవిధురంబగు చిత్తముతోడఁ దారు గా నల కటు వోయి పంకరుహనాభుని రాముని రోసి పల్దినం బులు భ్రమ సంచరించుటయు బోయ తముం గని యార్ద్రచిత్తుఁడై. |
195 |
| క. |
కందువ చోటికిఁ గొని పో | వం దా రరుగుటయుఁ జెప్పి వనట గదిరినన్ డెందము గలంగఁ గన్నీ | రందంద మొగంబు మీఁద నగ్గల మురులన్. |
196 |
| సీ. |
తలవాంచి యేమియుఁ బలుకక యప్పార్థుఁ | డున్న నయ్యువిదలు వెన్నుఁ డూర్ధ్వ గతి కేఁగు టెఱిఁగి శోకము మూర్తులొందిన | తెఱఁగునఁ బొగిలియు ధీరభావ మాత్మల నెలకొన్న నన్న! నీవింతేల | యడలెదు? కాలపర్యయము నుడుప వశమె యెవ్వరికిని? వార్తలకొఱఁత జె | ప్పుము మాకు ననుడు నప్పుణ్యచరితుఁ |
|
| ఆ. |
‘డడవిలోన మేము తడసిన దినముల | న్నియు గణించి యంబునిధి పురంబు రేపకడయ ముంచు నేపాట నిమ్మెయి | వచ్చు నెడరు దలఁగువార మొక్కొ! |
197 |
| చ. |
అను తలఁపాత్మ నొందుటయు నప్పటి కద్దెస మీకు నెల్లఁ జె ప్పిన నుచితంపు భంగులకుఁ బెద్దయుఁ బ్రొద్దు చనంగ నప్పురం బునఁ గల విప్రముఖ్యజనముల్ పయనంబున కర్హమైన వ ర్తన మొనరింపలేమి జలరాశి మునుంగుదు రట్లు గావునన్. |
198 |
| చ. |
హరికిని రామదేవునకు నర్హవిధానము లాచరించి యె వ్వరికిని జెప్ప కెల్ల పరివారముఁ బౌరులు సామజాదులున్ సరకులు నాయితంబు లగు సంఘటనం బొనరించి నాఁటికిం గర మవధానయుక్తి సమకట్టితి నెవ్వగతోఁ బ్రయాణమున్. |
199 |
| తే. |
వినుఁడు యాదవభామినీవృద్ధబాల | జనుల నందఱ నుచితవర్తనముతోడఁ బ్రొద్దువొడువక ముందర పురజనప్ర | యుతముగాఁ బురి వెలువరించితిఁ గడంగి. |
200 |
| ఆ. |
దానఁ జేసి మీరు నేనును బ్రయ్యుఁ బా | పంబు లేక వెడలఁ బడితి; మిదియ తల్లులార! కరము తప్పయి తోఁచుట | నుల్ల మలఁత పేర్మి నురియుచుండు. |
201 |
| క. |
వినుఁ డీ తప్పున దోషము | దనుకక యుండంగ నన్ను దయతోఁ జూడుం’ డనుచు నిలఁ జాఁగి మ్రొక్కినఁ | గని యందఱు నెత్తి యతని గారవ మెసఁగన్. |
202 |
| క. |
ఊరార్చి ‘యింక నుచితా | చారంబులు నడపుటయ యిచటఁ గృత్యము; దు ర్వారం బగు విధిచేఁతకు | నేరికి నడ్డపడవశమె? యేల యలఁదురన్?’ |
203 |