| కావ్యములు | తిట్లదండకము | పోలిపెద్ది వేంకటరాయకవి |
కవి పరిచయము
- శ్రీ వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
తిట్లదండకము - పోలిపెద్ది వేంకటరాయకవి
| పంచాగ్ని ప్రదానము (కోవూరు రామయ్యకు) |
| పోషకుని కెగ్గు దలఁచు నల్పుం డెవండొ, స్వార్థమున కొక మితి లేని చవట యెవఁడొ, మేలొనర్చిన హితుఁ దిట్టు కూళ యెవఁడొ, వానికిది చీఁపురులమాలయై నెగడుత! |
| తల్లి చనుబాలు ద్రావి యా తల్లి ఱొమ్మె గుమ్ము సత్పుత్రుఁ డెవ్వఁ, డన్నమ్ము వెట్టి- నట్టి యింటికిఁ గన్నమ్ము వెట్టు నెవఁడొ వాని కీ కృతి యగుత శూర్పముల శాళ్వ! |
| ఱేయి దన యమ్మ ప్రక్కను హాయిఁ బండి ముదమనుభవించి, యంతట నుదయమగుడు ‘అమ్మ! తే తేవె, నా కూలి’ యనెడు ద్రోహి టక్కరికి నిది తృణకిరీటమయి తనరు! |
| పీనుఁగందపుఁ బొటినక్క మేని కాకి, పొట్టవొడిచిన ముక్క లేనట్టి బోఁకి, పాకిదొడ్ల కస్మాలపు లేకి యెవఁడొ వాని కీ కృతి యినుంపపతక మగుత! |
| పంచకోలకషాయము పంచిపెట్టి, పరుల యెంగిలిమెతుకులు పంచిపెట్టి, పాసికంపు బండారము పంచిపెట్టి, బ్రతుకుచెడు గీ కృతికి నగు బడిసివాటు! |
| తిట్లదండకము (తగణ దండకము) |
| చీ, చీ, ఒరే, పాతకా, ఘాతుకా, ప్రేత, దుర్నీత, మన్బోత, ఉచ్చిష్టపున్ రోఁత, వారాంగనామూత్రముల్పట్టు ముంతా! ఇదే చూడరా, ధాత నీ వ్రాత నా చేత పట్టిచ్చెరా నేఁడు; దుర్బీజమా, నైజమా, సాజమా, నీతమా! ఏర కోవూరి రామా, హరామా, గులామా, పురీషంపు తూమా, ఉపారాల వేటా, వలిక్కాలి చేటా, దగాకోరు ఫాజీ, దగుల్బాజి మాజీ, దులాభీల ఖాజీ, శనైశ్చర్యు తేజీ, గరాస్పంద [1]మురారు, మురాళ్ - ఒకే పదము ముర్టారు, హల్కా, దివానా, బహంచోతు, లమ్డీకె, ఖంగారు కప్తా, చమర్బేహియా, చూతియా, మొండి లండీ, శిఖండీ, చణిర్భీసు, దర్భీసు, మట్రాసు, పట్రాస్, కఫర్భేటి చోటీ, నమర్దా, ముఠాల్, గాడ్దె లష్కారు, భడ్వా! ద[...]ళాన్, దివాల్కోరు, [2]బేవకూప్ బేకూఫు, బేమాని లుచ్ఛా, హరాంకోరు బచ్చా, బలాదూరు తుచ్చా, [3]తెగిన పాతముచ్చె తెగిన్పాత ముచ్చా, సురాపాన పూర్షాధమా, వ్రాత్యమా, త్వాష్ట్రమా, ఖొజ్జ, శుంఠా, యనాథాతతాయీ! |
| భువిన్ గల్గు సంకర్లు, సుంకర్లు, యాకిర్లు, పోకిర్లు, దొమ్మర్లు, దిమ్మర్లు, కమ్మర్లు, కుమ్మర్లు, [4]పట్టుసాలె పట్సాలె, [5]ముత్తరాచులు ముత్రాసులున్, జాండ్రులున్, ఈండ్రులున్, కోయలున్, బోయలున్, జోగులున్, వేఁగులున్, పల్లెలున్, గొల్లలున్, మాదిగల్, మాల, లింగ్లీసులున్, [6]పోర్చుగీసులు బుడ్తకీచుల్, [7]ఫ్రెంచివారు పరాసుల్, [8]దుష్టులు గరాసుల్, పిసాసుల్, తురుష్కుల్, ఒలందాలు, [9]కొండజాతి చోరులు తోడాలు, పార్సీలు, చండాలురున్, బుల్కసుల్, శ్వాపచుల్, మాగధుల్, బండలండాలు, [10]మహారాష్ట్ర ప్రాంతమున బాటసారులఁ జంపుచుండిన దారిదోపిడిగాండ్రు పిండార్లు, [11]దూదేఁకులవారు పింజారులున్, జారులున్, జోరులున్, గుక్కలు, న్నక్కలున్, కోఁతులున్, [12]కుచ్చితపుఁ దిట్టు దిట్టువారు [ఇక్కడ ‘బాతులున్’ అనే పదం ఉండడం సందర్భానుసారంగా, ఉచితంగా తోస్తుంది - ‘ఆంధ్రభారతి’] బూతులున్, కోళ్లునుం, దేళ్లునున్, లేళ్లు, తాఁబేళ్లునున్, గొఱ్ఱెలున్, బఱ్ఱెలున్, ఏనుఁగల్, [13]తూనీఁగలు తూనిగల్, చీమలున్, దోమలున్, పిల్లులున్, బల్లులున్, మల్లులు, న్నల్లులున్ [14]గాడిదలు రాసభాల్, [15]కంచరగాడిదలు వేసడా, లెడ్లు, [16]కణఁతులు అను అరణ్యమృగములు కొర్నాసిగాం, [17]ఒంటెలు డ్లుష్ట్ర, [18]ఎలుగుబంట్లు భల్లూకముల్, [19]గ్రుడ్లగూబలు ఘూకముల్, కాక, శార్దూల, మార్జార, [20]నెమిళ్ళు మాయూర, [21]కప్పలు మండూకముల్, [22]ఊదలు గృధ్ర [23]పావురాళ్ళు పారావతా లాదియౌ ప్రాణిజాలంబులున్, [24]చిత్తకార్తెకు జతగూడు మృగములవలె చెలరేఁగి చిత్తగల్ రేగి, నీ యమ్మనుం గ్రుమ్మ, నీ యబ్బనుం ద్రొబ్బ, నీ యక్కపైనెక్క, నీ యత్తనున్మొత్త, నీ యన్ననుం దన్న, నీ చెల్లెలిన్గొట్ట; |
| నీ యాలు కామాక్షి నిష్కారణం బూరకే మమ్ము నిందింపఁగా జూచి, నీవైన “ఏమోసి, [25]రోఁత కలదాన యేబ్రాసి, [26]మలినము గలదాన కస్మాలమా, చాఁకిబండా, చలం గల్గు ముండా, [27]నిలువున (నిన్ను) సగమునకు కోసివేయ సగం కోయ రండా, [28]అపవిత్రాల చిప్పా అమేధ్యాల బొండా, అనాకారి [29]మొద్దా తుండా, [30]అల్లరి కూళా అడావూడి లండా, ఫిరంగీల గుండా, వికారాల బండా, విసర్జించు కుండా, [31]ఱంకులాఁడి వ్యభీచారి, నీ సిగ్గు మండా, అపస్మారమా, [32]అప్రయోజకురాలా లేకి, పల్గాకి, [33]దరిద్రురాలా గాల్గుడ్డ, [34]తుంటరిదానా రాల్గాయి, [35]పెద్దమ్మా జ్యేష్ఠా, కులభ్రష్ట, [36]మానము లేనిదాన బాడ్గోల, [37]పెంట గలదాన పెంటచ్చ, తల్కొట్లమారీ, [38]దేహమమ్ముకొను చెడిపె బజారీ, [39]మదము గలదాన మిటారీ, [40]దిట్టతనము గలదాన తుటారీ, పురిట్లోని కాటేరి, మిల్టేరి, జల్దారి, భస్మాసురీ, [41]విమతవర్తనఁ గలదాన, కాఫిరీ, [42]సారాయి మైకము కలదాన లాహిరీ, [43]తుప్పుపట్టిన రాగి (నాణెమా) కాసా తుప్పు దుగ్గాని, పైశాచి, బస్వీ, దసీ, పాడుగోడా, [44]మలస్రావము గల పాయువా పుసిం గారు పూడా, నెగుల్ బుట్ట, కడ్గండ్ల దుంపా, [45]దృష్టిదోషము పోవుటకై త్రిప్పు గంపా బడిం ద్రిప్పు గంపా, రగుల్పాట్ల కొర్వీ, [46]దుర్మార్గురాలా చెడే యుల్పిగొట్టా, ఒసే బోడి [47]దూఁబఱఁదిండి గలదాన బోగ్బోడి, [48]క్షుద్రదేవతాలయమా మైలార్గుడీ, సంతలంజా, మహామైథునీ, లంకిణీ, తాటకీ, భూతకీ, ఘాతకీ, చుప్పనాతీ, ఫిరాతిన్నిరాతీ, దసీ - గండుకోతీ, కసీసంపు మూతీ, శ్మశానంపు జ్యోతీ, యథాజాత ఆషాఢభూతీ, యరాతీ, బళీ ఱంకులాఁడీ,” యటం చొక్కమాఱైన గద్దించి, నీకిద్ది మేల్బుద్ది గాదంచు వాదింపరాదా? మదిం దోఁపలేదా? తుదిన్ నీకు నా చేత చావయ్యెఁ గాదా? సదా దాని పాదాలకున్ లొంగి, వెంటాడుచున్ కూడుచున్నుందువే? మంకుకుంకా! మలంబెత్తు పెంకా, నినుం బంకజాక్షుండునుం, బంకజాసీనుఁడున్ శంకరుండైన గావంగ లేరింక, నిశ్శంకగాఁ జెప్పెదన్, నిగ్రహానుగ్రహాదిప్రభావంబు నా వాకునందున్నదో లేదొ, నీ కిప్పుడే కన్పడుం జూడుమా, నాదు శాపంబు వమ్మౌనె? ముమ్మాటికిం గాదు సుమ్మా, అదే, మృత్యువేతెంచి, కేల్సాచి, నిన్బట్టఁగాఁ బొంచి, కాలంబు లెక్కించుచుంటన్ విలోకింపుమా, మూర్ఖపూర్షాధమా! |
| వేదవేదాంతతత్త్వజ్ఞుడన్, వైదికశ్రేష్ఠుఁడన్, సజ్జనస్తవ్యుఁడన్, సాధుసాంగత్యమున్ గల్గువాఁడన్, సదాచారశీలుండ, శ్రీ వేణుగోపాలసద్భక్తుఁడన్, పోలిపెద్దాన్వయాబ్ధీందుతుల్యుండ, శ్రీ వేంకనార్యుండ, నాస్థానవిద్వాంసుఁడన్, సత్కవీంద్రుండ, శ్రీ కారువేటీ పురాధీశు శ్రీమన్ మహామండలేత్యాది వాక్యాళిసంశోభితున్, రాజరాజేశ్వరున్, మాకరాడ్వంశసంజాతు, శ్రీ వేంక్టపెర్మాళ్ళ రాజాశ్రితుండన్, సదాచార సన్మానితుండన్, ననుం దిట్టఁగాఁ బూని, యేడాదిగాఁ దిట్టి, బల్ దిట్టనంచెంచెఁ గాఁబోలు, నీ యాలు, కామాక్షి, హా, దాని గర్వంబు నేమందురా, క్రూర, పాపిష్ఠ, నీ పాడె గట్టా, యనాచారపున్ ముట్టుబట్టా, నినున్ మిత్తి [49]నడినెత్తిపై నణ్ణెత్తిపైఁ గొట్ట, పాపాల బుట్టా, యముండిట్టి నిన్బట్టి, కాల్సేతులం గట్టి, కొంపోవఁగా వచ్చె, నీ కాలముం జెల్లె, నా శాప మీడేఱు, నిక్కంబు, నిక్కంబు, నీ వింటికిం బోయి, వేవేగ, కాల్ప్రోలికిన్ నేగుమా, సాగి, కోవూరి రామా, యయో, రామ, రామా, సమాప్తం, సమాప్తం, సమాప్తం! |