అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-5
సంపుటము: 1-11
రేకు: 2-5
సంపుటము: 1-11
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిశ్రీ
| ఇందుకొరకె యిందరును నిట్లయిరి కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు | ॥ఇందు॥ |
| అటమటపు వేడుకల నలయించి మఱికదా ఘటియించుఁ బరము తటుకన దైవము ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు | ॥ఇందు॥ |
| బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా కొం డనుచుఁ బర మొసంగును దైవము బండు సేయఁగ హరికి బంతమా? యటుగాదు యెండ దాఁకక నీడ హిత వెఱఁగరాదు | ॥ఇందు॥ |
| మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా తనభ క్తి యొసఁగు నంతట దైవము ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు తినక చేఁదునుఁ దీపు తెలియనే రాదు | ॥ఇందు॥ |


