అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-1
సంపుటము: 1-14
రేకు: 3-1
సంపుటము: 1-14
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు | ॥గాలినే॥ |
| అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు గడుగుకొననే పట్టెఁ గలకాలము ఒడలికి జీవుని కొడయఁడైన హరిఁ దడవఁగా గొంతయుఁ బొద్దు లేదు | ॥గాలినే॥ |
| కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె కలుషదేహపు బాధఁ గలకాలము తలపోసి తనపాలి దైవమైన హరి దలఁచఁగా గొంతయుఁ బొద్దు లేదు | ॥గాలినే॥ |
| శిరసు ముడువఁ బట్టె చిక్కు దియ్యఁగఁ బట్టె గరిమలఁ గపటాలఁ గలకాలము తిరువేంకటగిరిదేవుఁడైన హరి దరిచేరఁ గొంతయుఁ బొద్దు లేదు | ॥గాలినే॥ |


