అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-2
సంపుటము: 1-15
రేకు: 3-2
సంపుటము: 1-15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ వట్టి నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా | ॥ఎవ్వారు॥ |
| అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక తొడరి కంపలకిందు దూరినట్లు నడుమ దురితకాననముల తరిఁ బడి వెడలలేక నేము విసిగేమయ్యా | ॥ఎవ్వారు॥ |
| తెవులు వడినవాఁడు తినఁబోయి మధురము చవిగాక పులుసులు చవి గోరినట్లు భవరోగములఁ బడి పరమామృతము నోరఁ జవిగాక భవముల చవులాయనయ్యా | ॥ఎవ్వారు॥ |
| తనవారి విడిచి యితరమైనవారి వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు అనయము తిరువేంకటాధీశుఁ గొలువక మనసులోనివాని మఱచేమయ్యా | ॥ఎవ్వారు॥ |


