| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా |
| కల్యాణి - రూపక ( - త్రిపుట) |
| పల్లవి: |
| ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా ఆ.. |
| చరణము(లు): |
| పరమద్రోహివి నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆ.. |
| ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్ఠి ఏరీతి ప్రస్తుతి చేసెనో వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా ఆ.. |
| ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు నిన్ను నమ్మరాదు నిన్నుదైవమనరాదు నిజము నామాట రామా ఆ.. |
| ఆదరణలేని రామమంత్రము ఆడితిని నినుదూరితిని ముద్దుమాటలుగాని మూర్ఖవాదముగాదు మురహర ననుగావుమీ రామా ఆ.. |
| ముద్దుమోముజూపి ముదమొప్ప రక్షించు భద్రశైల పరిపాలకా వద్దురా కృపనేలు రామదాసునిమీద వైరమా వైదేహిసహిత శ్రీరామా ఆ.. |