| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ.. |
| అసావేరి - త్రిపుట |
| పల్లవి: |
| ఉన్నాడో లేడో భద్రాద్రియందు ఉ.. |
| చరణము(లు): |
| ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు ఉ.. |
| నన్నుగన్న తండ్రి నా పెన్నిధానము విన్నపము విని తా నెన్నడు రాడాయె ఉ.. |
| ఆకొని నే నిపుడు చేకొని వేడితే రాకున్నా డయ్యయ్యో కాకుత్స్థ తిలకుడు ఉ.. |
| వాటముగ భద్రాచల రామదాసుతో మాటలాడుటకు నాటకధరుడు ఉ.. |