| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా |
| కాంభోజి - ఆది (త్రిపుట) |
| పల్లవి: |
| ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ఎ.. |
| చరణము(లు): |
| ప్రకటమాయెను పాపములెటుల బాధకోర్తును శ్రీరామా సకలలోక రాజ్యపదవికి ఎక్కువైనయట్టి శ్రీరామా ఎ.. |
| పృథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామా విధులు జరుపవలయు విషయవాంచలు దలుపక శ్రీరామా ఎ.. |
| మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా ఎన్నడిట్లుండి రాఘవ నేనెరుగ నను గన్నయ్యా శ్రీరామా ఎ.. |
| కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షింపుమంటి శ్రీరామా ఎ.. |