| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ.. |
| ఆనందభైరవి - ఆట (- ఆది) |
| పల్లవి: |
| ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ ఎ.. |
| చరణము(లు): |
| ఎటుబోతివో నిన్ను వేడుకొంటే కటకటానేడు నా కనుల జూతామంటె ఎ.. |
| అంధకారమువంటి బంధిఖానాలో నున్న నింద బాపవదేల మ్రొక్కెద స్వామి ఎ.. |
| పాపములన్నియు యెడబాపే దొరవు నీవు ఆపద దీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి ఎ.. |
| తానీషాగారు వచ్చి సరితీర్పు జేసెదరు పన్నుల పైకము బంపి బంధిఖానా వదిలించు ఎ.. |
| అపరాధినని చాల నుతిచేసి మొరలిడగ నెపమెంచి విడిచేవు నేరములు తలచి ఎ.. |
| అప్పులవారొచ్చి యరికట్టుచున్నారు ఒప్పుకోబడునని చెప్పక దాగినావు ఎ.. |
| నీవు భద్రాచలనిలయుడవయ్యు రామ బ్రోవుమయ్య రామదాసు నేలెడిస్వామి ఏ.. |