| కీర్తనలు | భద్రాచల రామదాసు | పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ |
| యదుకులకాంభోజి - ఆది |
| పల్లవి: |
| పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ స్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా.. |
| చరణము(లు): |
| ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనె గొబ్బున గాచితివట జాగుసేయక ఎంతో నిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్న తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా.. |
| సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగశాయి విని నే విన్నవించితిని విన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామ యెన్నటికి నమ్మరాదు రన్న న్నన్నన్నన్నన్నా పా.. |
| చయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను వెయ్యారు విధముల రామ వినుతిచేయ సాగితిని యియ్యెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న నీ యొయ్యార మేమనవచ్చు నయ్య య్యయ్యయ్యయ్యయ్యయ్యో పా.. |