| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామ రామ రామ రామ శ్రీరామ రా.. |
| ముఖారి - ఆది |
| పల్లవి: |
| రామ రామ రామ రామ శ్రీరామ రా.. |
| చరణము(లు): |
| రామ రామ యని వేమరు నామది ప్రేమమీర నిను పిలిచిన పలుకవు రా.. |
| తలచినపుడె చాల ధన్యుడనైతిని పిలిచిన పలుకవు పీతాంబరధర రా.. |
| తిలకము దిద్దిన తీరైన నీమోము కలనైన చూపవు కౌస్తుభభూషణ రా.. |
| శంఖచక్రము లిరువంకల మెరయగ పొంకముతో నా వంక జూడవేమి రా.. |
| పరమపురుష భద్రగిరిరామదాసుని కరుణ నేలుమని శరణని వేడితి రా.. |