| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామనామ మందుకొనరే పామరులారా |
| నదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| రామనామ మందుకొనరే పామరులారా రామజోగి మందుకొనరే రా.. |
| చరణము(లు): |
| రామజోగి మందుమీరు ప్రేమతో భుజింపరయ్య కామక్రోధములనెల్ల గడకుపారద్రోలె మందు రా.. |
| మదమాత్సర్య లోభములను మాటలో నిలిపెడిమందు గుదికొన్న కర్మములను గూడక యెడద్రోలెమందు రా.. |
| కాటుక కొండలవంటి కర్మము లెడబాపుమందు సారెకు నీమంబు సాటిలేని భాగవతులు స్మరణచేసి తలచేమందు రా.. |
| ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించేమందు సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచేమందు రా.. |