| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము |
| ఆనందభైరవి - చాపు ( -త్రిపుట) |
| పల్లవి: |
| రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము రామనామ సుధామధురము అది ఏమరక భజియించు మాకిక రా.. |
| చరణము(లు): |
| శ్రీలమేలు భయానకము రఘువీరుల పేరే పానకము పాలుమీగడ జారుతేనియ పాలకన్నను మేలిమైనది రా.. |
| ఈ రసములెల్ల నీరసము రఘువీరుని కథలెల్ల పాయసము సారెకు మాకు చేకూరెను ఆకలి తీరి తృష్ణ చల్లారెను రా.. |
| ఘోరభవసింధు తారకము హృదయారి వర్ణనివారకము సారమౌ ఘనసార కదళీఫలసార సౌఖ్యమా పారము రా.. |
| సుందర శ్రీరాములు రఘునందనాంఘ్రి సరోజములు చెంది బ్రహ్మానందభావము నందరికి నింపొందజేసిన రా.. |
| భాసమాన శుభకరము నిజదాసలోక వశీకరము భూసుత హితుడై భద్రాచలవాసుడై రామదాసునేలిన రా.. |