| కీర్తనలు | భద్రాచల రామదాసు | రామపరాకు రఘురామ పరాకు |
| నాదనామక్రియ- తిశ్ర ఏక |
| పల్లవి: |
| రామపరాకు రఘురామ పరాకు స్వామి భద్రశైలధామ పరాకు రా.. |
| చరణము(లు): |
| శ్రీవత్స కౌస్తుభసింహ పరాకు శ్రీవల్లభ కారుణ్య పరాకు రా.. |
| అక్షయ పాండవపక్ష పరాకు పక్షివాహన భక్తరక్ష పరాకు రా.. |
| భద్రేభవరద దాసభద్ర పరాకు చిద్రూప కరుణాసముద్ర పరాకు రా.. |
| హీరమాణిక్య కేయూర పరాకు తారహార యశపూర్ణ పరాకు రా.. |
| కుంభనికుంభ నిర్దంభ పరాకు గంభీరసమర విజృంభ పరాకు రా.. |
| ఖండాఖండ ఉద్దండ పరాకు చండప్రచండకోదండ పరాకు రా.. |
| ప్రేమతో భద్రాద్రిధామ పరాకు రామదాస పోష రామ పరాకు రా.. |