| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 103. ఆనందమే లేదా |
| 103. ఆనందమే లేదా |
| ఆనందమే లేదా లోకమున నానందమే లేదా? |
| ప్రకృతి యందముల పరికించుటలో ఆనంద... |
| ఇంపగు నీ సెల యేటి గానమున ఆనంద... |
| కూకూ యను నీ కోయిలపాటల ఆనంద... |
| వీనులవిందౌ పిట్టలబాసల ఆనంద... |
| పూవులు దాల్చు న పూర్వపు శోభల ఆనంద... |
| చిగురుటాకుల న్నగు వసంతమున ఆనంద... |
| అరుణములౌ సాం ధ్యారాగంబుల ఆనంద... |
| మైమఱపించెడు మలయవాయువుల ఆనంద... |
| పాఱెడు మబ్బుల పందెపు పరుగుల ఆనంద... |
| మొగిలు కన్నియల ముద్దు మోములను ఆనంద... |
| చక్కదనంబుల చందమామ గన ఆనంద... |
| మిన్నున చుక్కల మిన్కు మిన్కులను ఆనంద... |
| చలువ వెన్నెలల సయ్యాటలలో ఆనంద... |
| అలరుందేనియ లాని పాడుటలో ఆనంద... |
| తీయనిపండ్లను దిని యాడుటలో ఆనంద... |
| కీచురాయివెత కీయని పాడగ ఆనంద... |
| నిశీథముల గను నిశ్శబ్దములో ఆనంద... |
| చోద్యపు లోకము చూపు నిద్రలో ఆనంద... |
| పులుగుల మేల్కొలు పులు విని లేవగ ఆనంద... |
| ప్రభాతవాయువ బరవశ మొందగ ఆనంద... |
| దేదీప్యంబుగ తేజరిల్ల మిను ఆనంద... |
| బాలభాను డం బరమున వెల్గగ ఆనంద... |
| లోచనంబులకు లోకము గన్పడ ఆనంద... |
| ఆదర్శములా కాశము నంటగ ఆనంద... |
| పొంగెడు నాసలు పురికొల్పగ మది ఆనంద... |
| భగవంతుని కడు భక్తి బాడగను ఆనంద... |
| ఆనందమే లేదా లోకమున నానందమే లేదా? |