| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 181. మత్తుమందు |
| 181. మత్తుమందు |
| ఎవరేశారీ మత్తుమందు ఎన్నాళ్ళదాకాను, ఈ మొద్దునిద్దర ఎవరే... |
| నల్లమందైతేను, నాలుగ్గడియలవరకె కల్లు మత్తైతే పది గడియలవరకేను ఎవరే... |
| తాచు విషము కూడ తగ్గేను మంత్రముతో ఏదివ్యమంత్రముతో యీమత్తు తగ్గేనో ఎవరే... |
| గాంధీమహాత్ముడు కనిపెట్టినట్టి యీ సత్యాగ్రహమంత్రముతో మత్తు వదిలేనేమో |
| ఎవరేశారీ మత్తుమందు ఎన్నాళ్ళదాకాను, ఈ మొద్దునిద్దర |