| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 153. నిరాశ |
| 153. నిరాశ (జేబున్నీసా) |
| అల సాలసమ్ములౌ హస్తమ్ములార! ప్రాణేశు కౌగిలి బడయరైతిరిగ! శుష్కించి యీరీతి జొక్కుటకన్న విరిగిపోవుటయె మే లరసిచూడంగ. |
| దండుగమారి నేత్రములార! మీరు కాంతు ని న్నేండ్లుగ గానరైతిరిగ! బాష్పజడతను నిష్ఫలములౌకన్న బొత్తలై పూర్తిగ పోవుటే మేలు. |
| కొరమాలినట్టి యో చిరిసోనలార! చెలువుని నాప్రక్క జేర్పరైతిరిగ చిన్నతనమునాటి స్నేహితులెల్ల రకట తమతమ త్రోవ నరిగిరిగాదె |
| వాడుగులాబిపూవా! యదృశ్యముగ పుట్టినయట్టులే గిట్టిపోయెదవె? ప్రియుని కిరీటాన వెలయంగలేక మద్ధృదయసుమంబ! మంట గలిసితివె? |