| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 034. ప్రేమమాయ |
| 34. ప్రేమమాయ |
| కల్లగాదిది నమ్మగా దగు సకియ! వంగెడు బంగారు వరిపైరువోలె జలజల ప్రవహించు జలములవోలె వనిత నా హృదయమ్ము పడిలేచుచుండె. |
| అదృశ్యమైవచ్చు నాతనిశక్తి వార్ధినుండి ప్రచండవాయువుబోలె, అతని దూరాన నరసిన యంత కారణమ్మును నెఱుంగకయె మ్రొక్కెదను. |