| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 012. ప్రళయాగ్ని! |
| 12. ప్రళయాగ్ని! (ప్రపంచ యుద్ధము) |
| మండుకొని పోతున్న వండోయ్! లోకాలు మంట లార్పేయంగ రండోయ్! |
| జ్వాల లాకసమంట నాలుకలు జాపేను కాలానల మ్మిదే కాబోలు దైవమా! మండుకొని పోతున్న వండోయ్!... |
| ఎన్ని సంద్రాలైతె యీ మంట లారేను? ఆరకుంటేను లో కాలు భస్మాలౌను! మండుకొని పోతున్న వండోయ్!... |
| మనుజమాత్రుల కిట్టి మంట లార్పగనౌనె? కరుణించి కాసింత కనుముయ్యి ప్రళయేశ! |
| మండుకొని పోతున్న వండోయ్! లోకాలు మంట లార్పేయంగ రండోయ్! |