| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 068. సమానావస్థ |
| 68. సమానావస్థ |
| కాంతిపక్షమ్ములతో గగనమ్మున కడువడి బారెడు నో నక్షత్రీ! ఇంతజెప్పరాదే ఈ రేయిని నెచ్చట నీ పయనము నాపెదవో? |
| వాడి విన్ననౌ వదనముతోడుత స్వర్గవీధి నొంటిబోవుచంద్రా! ఏడ నీ యగాధ నిశీథమ్మున తోడు లేక నిద్రింతువె చెపుమా? |
| ఇలు వెడలింపబడిన చుట్టమటు లిల యెల్లను దిరుగు మందపవనా! నిలుతు వింక నేకోటరమున నే యలపయి వేగమ తెలియంజెపుమా? |