| శతకములు | కఱివేల్పుశతకము | వైదర్సు అప్పయకవి |
| కఱివేల్పుశతకము - వైదర్సు అప్పయకవి | ||
| సీ. | సిరిమించుమించు వైఖరి గనుపట్టు హొం- | బట్టుదుప్పటివల్లెవాటు మణికి- రీటంబునీటు సిరిమెఱుంగుఁబోఁడితో | బుట్టిన గొప్పకెంపుపతకంబు కమ్మకస్తురితిలకంబు డంబువిడంబ- | నం బొనర్పఁ జతుర్భుజంబులందుఁ జిందంబు సుడివాలు సింగాణి యడిదంబు | గద మొదలగు నైదుకైదువులను | |
| గీ. | బూని దేవకికడుపునఁ బుడుతవడువు | నఁ బొడమి, పుడమిజడు పుడుపఁ బచరించి- నట్టి నా సామి నీకు జోహారు సేతు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 1 |
| సీ. | మొలకనగవు ముద్దుమొగము చిగురుమోవి | మెఱుఁగుఁజెక్కుల మిసమిస లెసఁగ, నొ- సలిపై ముసరి పెంపెసలు గూర్చు కురులఁ గ- | న్నులఁ దీర్చి బుగ్గపై నిలిపినట్టి చిన్నికాటుకచుక్క చెలువంపు బొమల న- | డుమనిడ్డ యుక్కబొట్టు చెలువడర నడుగుఁదమ్మికి గంగ యలరుదేనియఁగా నె- | గడుతండ్రివి యశోద పుడిసెడు జల- | |
| గీ. | ములకు నుగ్గు గుడిచి, యల నలువఁ గన్న | బొడ్డుతామర కొకగుడ్డ యడ్డ మునుప దగుదునని పవ్వళించితే తల్లియొద్ద | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 2 |
| సీ. | జతకుల్కు తళ్కువజ్రాలకళాసిగీ | పని చొకాటంపు కుందనపురావి- రేక నుదుట నుదుటై కనుపింపఁ జెం- | పల పక్కిరాపచ్చబావిలీ ల- సదుక్రొంబసల నించ నెదపయి పైగోవ | కెంపురారవ చెక్కడంపు జాళు- వా గొలుసుకొన మువ్వన్నెమెకముగోళ్ళ | మెఱుఁగు తురఁగలింప మేల్కడాని | |
| గీ. | తాయెతుల్సందిట నటింపఁ దల్లిమ్రోలఁ | జెలువు దీపింప ముద్దులుసేయు నీదు చక్కఁదనమెన్న వేనోళ్లు చాలవన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 3 |
| సీ. | పొంచి తల్లిని మఱపించి బాళ్వామొల | నూల్చిఱుగంటల నుడి నడంచి పసిఁడిగజ్జెలను జొప్పడెడు చప్పుడుకుంచి | కుందనపు మురిడిగొలుసును మురుఁ- గునఁ గట్టిగ బిగించి గూనలఁ చెయి ముంచి | చిన్ని బొజ్జపయి పాల్చినుకఁ గనక- హస్తపల్లవమున హస్తపల్లవము నొం- | డొండ నుంచి భుజంబు లుబ్బఁ బెంచి | |
| గీ. | మెడ నొకించుక కుదియించి మేను వంచి | కడలు వీక్షించి నీవు మీఁగడ భుజించు చక్కఁదనమెన్న వేనోళ్లు చాలవన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 4 |
| సీ. | కలికి యిచ్చిన పాలు కడుపు నిండనిలాగు | రక్కసివిసపుఁ బాల్గుక్కకొనుట తరుణి పెట్టిన వెన్నఁ దనివి దీఱనియట్లు | వ్రేపల్లె మ్రుచ్చిలి వెన్నఁ దినుట నతివ గట్టిన చల్ది యాపోవనటువలె | విప్రభార్యల బువ్వ వేఁడికొనుట నన్నొసంగిన కజ్జమాస దీఱనిరీతి | మేలియపూపముల్ చాలఁ గొనుట | |
| గీ. | రట్టడితనానఁ దల్లిని రవ్వసేయఁ | దలఁచి కాక జగంబులు గలుగ నీదు బొజ్జ నిండింప నెవ్వరు పూనువారు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 5 |
| సీ. | మెయిఁ బర్వు కార్చిచ్చు మీఁగడపరకయే | యట్టె కైకొని వడి నారగింప రక్కసివిసపు పాల్మిక్కుటంబయ్యెనే | గుటుకుగుటుక్కున గ్రుక్కగొనఁగ సుడిగాడ్పురాకాసి మెడఁ దూగుటుయ్యలే | యొప్పఁగా మిన్నంది యూఁచుకొనఁగ చట్టొకకొంచెపు సంగడంబయ్యెనే | నిలిచి కెంగేలను నిగుడఁబట్ట | |
| గీ. | దేవరకు నీకుఁ జెల్లె నీవేవి దలఁప | వా యశోదయు నినుఁ గొనియాడుచుండు పొలఁతి నేఁ జెల్ల నీ పోవు పోకలెల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 6 |
| సీ. | తళుకుబంగరు పారదంపుమువ్వాయెనో? | గాటంపు ఱోల్మొలఁ గట్టుకొనుట! దినము మ్రుచ్చుతనానఁ దిను వెన్న యఱుఁగనో? | చొచ్చి కార్చిచ్చును జుఱ్ఱికొనుట! పూతన చనుపాలఁ బొడము చేఁదడఁగనో? | వ్రేతవాతెర మేల్నవాతు గొనుట! బడిబడి నేతెంచు పగఱకు వెఱచియో? | పసికాఁపుపూఁబోండ్ల ప్రాపుఁ గొనుట! | |
| గీ. | తనకు నొడ లోముకొనుటయుఁ దథ్యమే క- | దా! “శరీరమాద్యం ఖలు ధర్మసాధ- న”మ్మనెడు మాట తన నెమ్మనమ్ము నాట | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 7 |
| సీ. | సొగసుగా నునుకురు లెగదువ్వి కట్టిన | తళుకుబంగరుజోరెత్రాఁడు సెలఁగ, నెలనెలఁ గల చెన్నునెన్ను నెన్నుదుటిపై | జిలుఁగుకస్తురిరేఖ చెలువు మీఱ, నొడికమై చెవుల నొప్పెడి గొప్పసుప్పాణి | చౌకట్ల తెలిడాలు చౌకళింప, గుదిఁగూర్చి యెదఁ జేర్చుకొనిన గుప్పెడుతళ్కు | బంగరుగొలుసులు రంగులీన, | |
| గీ. | సరిగపనికుట్టు హొంబట్టు చల్లడంపు | డంబు గనుపింప బురుసారుటంపు కాసె చెఱఁగు లల్లాడవచ్చు నీ యొఱపయారె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 8 |
| సీ. | నీ నగుమోము నీ నిద్దంపుఁజెక్కులు | నీ నిగారంపు పెన్నెరులు నీ రు- వారంపుకౌను నీ వాటంపుచూపు నీ | చిగురాకుమోవి నీ సొగసులౌ క- నుబొమలు నీ చిన్నినూనూఁగుమీసపు | రేఖలు నీ ముప్పిరిగొనిన పెను- దొడలు నీ తలిరాకుటడుగులు నీ చొకా- | టపుసోఁగముక్కు నీ డంబయిన గ- | |
| గీ. | ళంబు నీ బిత్తరంపుటురంబు నీ యొ- | యారపుం గండెపు భుజంబులట్టె గన్న వనిత లేమయ్య మగవారె నలతురయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 9 |
| సీ. | గండస్థలంబులఁ గఱఁగెడు మదధార | కరణి గడ్డము నునుకప్పుఁ దేర మోము చందురునందు మొనసిన కందునా | జోకయై మీసపురేక దోఁచ సిరివెలందుక కొల్వుచేయు జేజేరాచ | రాగద్దె యన ఱొమ్ము రమణ యెసఁగఁ తనుతమాలద్రుమంబునఁ బెనుపొందు శా- | ఖలనఁగ దీర్ఘబాహులు సెలంగఁ | |
| గీ. | జారు సికతోడ జాళువా కేసరులతోడ | నివ్వటిలు నీదు నూనూఁగు జవ్వనంపు హొయలు గని రాధ పయిఁబడకున్నె యహహ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 10 |
| సీ. | ఇరుగ్రేవ సిగపొందు నెనయ సంపెగమొగ్గ | నిగ్గు తాయెతుచుట్లు నీటు సూప, గంధంబు నునుపూతగాఁ బూసి తీర్చిన | ఱొమ్ము కస్తురిపట్టె లెమ్మె నెఱప, పావలంటి సెలంగు పైఠాణి సెఱఁగుల | దువ్వల్వవలెవాటు నివ్వటిల్ల, పసిఁడినిండొరనంటి యెసఁగు నేనికపంటి | దూబిడి నిడుసోగ తొంగలింప, | |
| గీ. | వచ్చి నినుఁ జూడ నీతోడ ముచ్చటాడ | కోర్కెలొనఁగూడఁ గవఁగూడ గుట్టువీడ కౌనులల్లాడఁ గనుచుండుఁ గలికిపిండు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 11 |
| సీ. | చికిలిమేల్బంగరు చిలుకు గోణమ్ముతో | మొల కుందనపుఁ జేల మురువుతోడ నపరంజిచాయ నిద్దపు రువారంబుతో | మొసలివాపోగుల మిసిమితోడ ముక్కున హురుముంజి ముత్యంపు మురుగుతో | కొనచెవి బావిలీ కొమరుతోడ రాణించు జిగిపచ్చరాచిల్క తాలితో | ప్రాఁగెంపు రాపాడు పత్రితోడఁ | |
| గీ. | జెలఁగు నినుఁజూచు వ్రేరాచచిగురుఁబోండ్ల | తాలిమి బిరానఁ జింపఁ గెందలిరుటలుఁగు నించువిలుకాఁడు చికిలి సేయించుగదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 12 |
| సీ. | సిరిపొత్తునకు నిన్నుఁ జేరనీయదొ కదా | వ్రేపల్లెఁ బెఱుఁగుట వినియెనేని, కలిమితొయ్యలి నెమ్మొగంబుఁ ద్రిప్పునొ కదా | చిల్లరకథలెల్లఁ జెవులఁబడిన, ననవిలుతల్లి పక్కున నవ్వునే గదా | వావిమాలిన యత్తవార్త వినిన, రేరేనితోఁబుట్టు గ్రేణి సేయునె కదా | సత్య పెన్జడవేటు జాడఁ గన్న- | |
| గీ. | ననుచు మదిఁ గొంతసంశయంబయ్యె మాకు | నైననేమాయె జాణవీ వట్టులేని లేని వగలెల్లఁ గొన్నిఁ గల్పించలేవె, | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 13 |
| సీ. | కట్టడివై బలిఁ గట్టివేయఁగఁ గదా | చెలి నిండుకౌఁగిటఁ జిక్కవలసె, పొంచి కోలను వాలిఁ బొలియించఁగాఁ గదా | మెలఁత కన్సన్నల మెలఁగవలసె, వెలఁదికై శివుని విల్విఱిచివేయఁగఁ గదా | మదిరాక్షి బొమముళ్ళ కొదుగవలసె, మగువవై శితికంఠు మరులుగొల్పఁగఁ గదా | విరిఁబోండ్ల వెనువెంటఁ దిరుగవలసె- | |
| గీ. | నటుల నిటు నీకుఁ జేచేత నత్తచేత | ననుభవంబయ్యె నింక నీకీ యత్త యెదుట నేమి కానున్నదో కదా యెఱుఁగఁ గాని | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 14 |
| సీ. | కర్ణాటకపు సిగ గనుపట్టు నునుపట్టు | పొంది క్రొందళ్కులందందుఁ బర్వ సొగసు రా రాజాతి మగరాకళాసిగీ | గెల్లాపటాతేట గ్రేళ్లు దాఁట తోరమౌ ముత్యాలఁ దులకింపు కెంపుల | చెంపఖల్లీరుచుల్ చెంగలింప నపరంజిప్రతిమ నిద్దపు మనీలాపని | బాజుబందుల ఠీవి పరిఢవిల్ల | |
| గీ. | నెసఁగు నిను నొంటిఁ గనియట్టి పసిడివంటి | పాయమెల్లను నీ పాలు సేయఁగోరి మమత పాలయ్యె గద! రాధ మదనబాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 15 |
| సీ. | మొలకనవ్వులఁ దాల్మి మూలల కొదిగించి, | మోముతేఁటలఁ గోర్కి మొలవఁజేసి, చక్కెరకెమ్మోవి గ్రుక్కిళ్లు కొల్పించి | కడకంటిచూపులఁ గళలు రేచి, తెలినునుకొనగోళ్ల గిలిగింత లొదవించి, | తొడబెడంగుల గగుర్పొడువఁజేసి, రాణించు నెద నెమ్మె రవిక కప్పుల మార్చి, | యొయ్యారమున నూర్పు లుడుగఁజేసి, | |
| గీ. | చెలఁగు నీ చెల్వు చీకాకు చేసి రాధ | సిగ్గుఁగొని జవ్వనము లూటిచేసెఁ గాక, దోసమా యింతి చేసిన దుడుకదేమి? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 16 |
| సీ. | ముసురుచుఁ జిక్కించు మొకరితుమ్మెదలకై | ముచ్చటై మోమెత్తి మురియ వెఱచు, పొగరానుకొని వచ్చు తగరుకోయిలలకై | వేడుకైనను మోవి విప్ప వెఱచు, పదరుచు నేతెంచు కొదమచిల్కలకునై | హవుసైన మాఱుమాటాడ వెఱచు, పగ చాటుకొని వచ్చు వెగటుజక్కువలకై | మనసైన గుబ్బ లేమఱఁగ వెఱచు, | |
| గీ. | ప్రౌఢయయ్యును దన ముగ్ధభావ మేర్ప- | డ, మెలఁగెఁ గదర యమునాతటంబు పొంత నొదవు వలవంత రాధ నిన్ వెదకునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 17 |
| సీ. | ముద్దీయ కటు మాఱుమోము సేయుటె కాని, | యలరుఁజెక్కుల గగు ర్పణచలేదు, కౌఁగిలీయక యోరఁ గైకొంటయే కాని, | పదుటు గుబ్బల యుబ్బుఁ బట్టలేదు, తేఱి చూడక చూడ్కి ద్రిప్పివైచుటె కాని, | యిఱ్ఱింకు కనుఁగ్రేవఁ నిముడలేదు, కలయికీయక తొడల్ గదియించుటే కాని, | నీవి జల్లని వీడ నిల్పలేదు, | |
| గీ. | కినుకఁ గొననేర్చి తమి దాఁచుకొనఁగ నేర | దకటకట! నీపైని యాపరాని మోహమిరువెంద నెయ్యంపు మోడియందు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 18 |
| సీ. | తొడరు రేజోతి చేఁతులకాఁక వడఁదాఁక | కలువపూటరిగెలఁ గ్రమ్మిక్రమ్మి, పయిఁగ్రమ్ము పువుదుమ్ముఁ బాయననంటి లేఁ- | దలిరుపేటురుమాళ్లఁ దరిమితరిమి, శుకపికాదుల పల్కులకు నుల్కుఁగొన కమ్మ- | వీనుల నంగుళు లానియాని, చలిగాలి యుడుకుసోఁకుల ఢాకకై సారె | దట్టంపుటీరాలఁ దార్చితార్చి, | |
| గీ. | అమ్మచెల్లంచు నిరుగడ నలమికొంచుఁ | దోడఁ జనుచుండు నుడిగంపుఁ జేడెపిండు విరిపొదలలోను రాధ నిన్ వెదుకఁగాను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 19 |
| సీ. | మునమున నడపించు ననతేనెగాసమ్ము | నెలగోలునకు మూల లీఁగలేక, యా వెంటఁ దారసంబగు కల్వదొర కేలు | గమిచివ్వ గరబారుఁ గదియలేక, ఆ పిఱుందున పువ్వుటందంబుపై వచ్చు | బేడిసడాల్ దేఱి చూడలేక, ఆ పైని పచ్చతేజీపౌజు కాల్మట్ల | నడరుపుప్పొడికోర లానలేక, | |
| గీ. | ఓడి యొడిచేతు లిడికొనియుండుఁ గాని, | హవుసునకునైన నీపైని యలుకఁబూన దతనుజయధాటి మది నాటి యా వధూటి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 20 |
| సీ. | చెక్కిటఁ జెయిచెంద సెకచింద వాతెర | గందనిట్టూర్పు లందందఁ బర్వ, ననుఁగునెచ్చెలులందఱును మది గుంద చ- | క్కనిమేను వెన్నెల గాసిఁ బొంద, తాలిమి డింద డెందమునఁ గొందలమొందఁ | గెందలిరుల పాన్పునందుఁ జేరి, యసురుసురంచు మోమరవంచు విధినెంచు | నశ్రులునించు లో నలమటించుఁ, | |
| గీ. | గదర నినుఁ బాసి యా రాధ కమ్మవిల్తు | మాయ యనఁబోలి యంతైనఁ జేయు జోలి నడరు మది జాలి జవరాలి కా విరాళి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 21 |
| సీ. | తల చూపనీయక తఱుము తుమ్మెదలకు | లపన పంకజరుచి లంచమిచ్చి, వాయెత్తనీయక డాయు రాచిల్కల | కధరబింబద్యుతు లాసగొలిపి, ఎలుఁగెత్తనీయక యేఁచు కోయిలలకు | కరపల్లవచ్ఛాయ కాన్కలొసఁగి, చనుకప్పుఁ దొలఁగ పైకొను జక్కవల యొద్ద | కనుమీల డాలు తాకట్టు పెట్టి, | |
| గీ. | కడఁగి యిబ్భంగి నేర్పునఁ గన్మొఱంగి, | డాగు నొకచెంత యమునాతటంబు పొంత, నొదవు వలవంత రాధ నిన్ వెదకునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 22 |
| సీ. | కళుకులూఱఁగఁ జాలు కమ్మపౌజుల డాలు | వాలుచూపులకు నివాళులీయ, పుక్కిటి నెత్తావిఁ బొల్చు వీడెపుఁ గావి | మోవికెంపునకుఁ జేమోడ్పులిడఁగ, జిగికడానిమెఱుంగు చీరకుచ్చు చెఱంగు | తొడబెడంగులకుఁ బావడలు వీవ, పదములఁ దళ్కొత్తు పదనులత్తుక జొత్తు | మీఁగాళ్లరుచికిఁ గైలాగొసంగ, | |
| గీ. | రాజసంబున నీరీతిఁ దేజరిల్లు | పొలుపు గని రాధప్రాయంబుఁ బొత్తిగాను గుత్తకొంటివిదేమిరా! యత్త యనక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 23 |
| సీ. | కరికుంభమధ్యసంఘటిత నీలాంజనం | బనఁ గుచంబుల నూఁగుటారు మెఱయ, కాలాహిమణిఫణాగతివేణి మొదలంటి | ఠీవి కెంపులరాఁకడీ చెలంగ, తన డాలు నిరసించు కనుమీలఁ బట్టఁ ద- | లంచి, కచయము నా లహరి ముంచి, మీనాంకుఁ డేసిన మేలుజాలంబనఁ | జేరుపాఁపటబొట్టు చెలువ మమర, | |
| గీ. | రాజసంబున నీరీతిఁ దేజరిల్లు | పొలుపుఁ గని రాధప్రాయంబు బొత్తిగాను గుత్తకొంటివిదేమిరా! యత్తయనక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 24 |
| సీ. | పావడఁ బాసి కన్పడు తొడనిగ్గుతో | వగఁజూపు కుఱుమాపు వలువతోడ, సేస లిట్టట్టుగాఁ జెదరు ముంగురులతో | వసివాడు నెమ్మోము మిసిమితోడ, పలునొక్కు లెడఁబడ్డ పలుచని మోవితో | సోగకన్నులఁ గల్గు సొలపుతోడ, నూఱట చెందిన యుదుటు చన్మొనలతో | రహి గట్టిముడివడ్డ రవికతోడ, | |
| గీ. | చెఱుఁగు మాసిన దినములఁ జెలఁగు రాధ | సోయగము నిన్నుఁ దరితీపు సేయుగదర! నిముస మొకయేఁడుగాఁ బోలి నిగుడఁజాలి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 25 |
| సీ. | రహి నూనెమెఱుఁగాని రాణించు వేణితో | సొలపుచూపుల తళత్తళలతోడ, పసుపాని పసఁబూని యెసఁగు నెమ్మేనితో | దళుకుఁజెక్కుల ధగద్ధగలతోడ, సిరిమించు సరిగంచు చీరకుచ్చెలలతో | దళుకుటందెల ఝళంఝళలతోడఁ గడలందుఁ గడలొందు కక్షదీధితులతో | బొగరుగుబ్బల నిగన్నిగలతోడ, | |
| గీ. | తేటపాటీల నాలవనాట నీటుఁ | జెందు రాధావధూటి కే చేటి సాటి వ్రతము చెడ్డను సుఖము చేపడెను గదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 26 |
| సీ. | దట్టంపుఁ గౌగిళ్లఁ దగ్గుడుమొగ్గుడుల్ | కుల్కుగుబ్బల యుబ్బుఁ గొంచెపఱ నుదుటు చక్కిలిగింత యుక్కిరిబిక్కిరి | యెడనెడ మరుసివం బెచ్చరింప చికిలి నున్గొనగోళ్ళ చిందఱవందఱల్ | అందందుఁ జిందఱ లొందచెంద నాపోని దప్పికి యక్కఱగిక్కఱల్ | గెడపి కెమ్మోవి సొక్కిళ్లు వోవఁ | |
| గీ. | గూకికవరవ కెఱలి యాగుబ్బు గాఁగఁ | దనరు నాలననాటి రాధావధూటి కూటమిఁ దలంప నదరెనో గుండె నీకు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 27 |
| సీ. | ఈలువు నీలమ్ము లెసఁగు సోరణగండ్ల | నొకచాయ నెలచాయ లొఱపుఁ జేయ కొణిగలఁ దళుకొందు కుందనంబుల గూళ్ళ | నొకదారి బకదారి యుద్దిసలుప రాణ రంజిలు నపరంజిపంజరముల | నొకనంక గొరువంక లుబుసుపుచ్చ గీల్బొమ్మ కైతమ్మిఁ గెరలు పూసురకటిగా- | డ్పొకయోర సెకదీఱ నూఱడింప | |
| గీ. | పసిఁడిక్రోవులఁ బన్నీరు ముసురుకొనఁగ | రాధతోఁ గూడ జాబిల్లిరాలమేడ వేసవులు సల్పవే క్రీడ వేడ్కతోడ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 28 |
| సీ. | కలకంఠి నునువాలు కనుబెళ్కులకుఁ దోడు | సోరణగండ్ల మించులు చలింప చెలికొప్పుపై నుప్పతిలు కప్పునకుఁ దోడు | చూఱుపట్టెల మొయిల్ చుట్టుకొనఁగ మగువ కుత్తుకఁబల్కు మణితంబులకుఁ దోడు | రహిమించు నురుముల రవమెసంగఁ బూఁబోఁడి చెలువంపు బొమవంపులకుఁ దోడు | తెఱగంటి దొరవింటి తెఱుఁగులంట | |
| గీ. | గగన మేవేళ నల పచ్చికడవ లీలం | బఱఁగు జడివాన నీకు నుప్పరిగెలోన నొదవె నా రాధతో జోక నుబుసువోక | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 29 |
| సీ. | బవిరి దీరిచిన యన్నువ గవాక్షుల వెంట | నొదవు సాంబ్రాణిధూపోష్మ వలన కలయఁబర్వెడు నవ్యకస్తూరికాఘుటి- | కామిళద్దీపికాఘర్మకలన నెయ్యంపుటలుకల నిగుడిపుక్కిళ్ళను | వెడలు నిట్టూర్పుగోర్వెచ్చ వలన సరస మేర్పడు బాహ్యసురతశ్రమంబునఁ | బొడము నెమ్మేనుల పొగరువెట్ట | |
| గీ. | నెట్లు చలిదీఱునబ్బ నీ కిఱుకుగుబ్బ | గుబ్బలుల నుబ్బతిలు నుబ్బ యబ్బకున్న మిన్నయగు రాధ కౌఁగిటి మిద్దెయింట | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 30 |
| సీ. | మూఁపునఁ గేలూది మురియుచుఁ గూర్చున్న | తరిగుబ్బ గోరొత్తఁ దగ్గుజగ్గు బలిమిఁ బైపడి మోవి బలునాటఁ గిలకిల | నగుచు నావలిమొగంబగు హొరంగు మగలాగు సల్ప నెమ్మొగము తప్పక చూడ | వాలుగన్నులు దేలవైచు బాగు కలియకు మలసి చక్కనిసామి నన్నిఁక | గాసిచేయకుమను కనికరంబుఁ | |
| గీ. | దలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ దెలియదీ వెట్టిదిట్ట- వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 31 |
| సీ. | అలరువాతెఱ పంటి కందిచ్చి యోరయై | కడలు గన్పట్టు క్రేఁగంటిచూపు మరుకేళి గవయు నత్తఱి తొడల్ గదియించి | పైకెక్కుటకు హౌసుపఱచు నొఱపు మగలాగు సల్ప ముందుగ నీవు గడఁగిన | తఱిఁ జూపులను దెల్పు దైన్యవృత్తి కలయక గిలిగింత గ్రమ్మ ఱొమ్మునఁ జేరి | ‘కదలించకుర’ యంచుఁ బదరు ఱంతుఁ | |
| గీ. | దలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట- వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 32 |
| సీ. | గంధసారముఁ బూయు కరణి చెక్కులురుండ | లాబలాకొనెడు చెల్వంపు వగలు నుపరతి నీరీతి నొదవింతు చెమ్మట | లను మాడ్కి బన్నీరు నినుచు బాకు కైచేసి రతిఁ జొక్కు గడిమించి గన్నారఁ | గనక ఱెప్పలు వ్రాల్చుకొనెడు వెరవు తొడ తలాడగ నున్నయెడ మంతనముఁ దెల్ప | తగ్గి మోమున మోముఁ దార్చు నేర్పు | |
| గీ. | తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట- వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 33 |
| సీ. | ముద్దిచ్చుతఱి చెక్కుటద్దంబు మోవివై | గదియించి యరచొక్కుఁ గాంచు సొబగు పెదవిపైఁ బలుకెంపు లొదవింప సీత్కృతి | నించి కన్బొమదోయి వంచు సొంపు పిఱిఁదిఁ గూర్చుండి పెన్నెఱులు దువ్వుచుఁ బొగ- | రడఁగ చన్మొనల వెన్నదుము హొయలు కలయఁగ నీ జడఁ గట్టివైతునటన్న | ఠీవి పెన్నెఱులు జాచుకోపు | |
| గీ. | తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ తెలియదీ వెట్టిదిట్ట- వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 34 |
| సీ. | తమి పోకముడి ఱొమ్ము దగులుచు నోరయై | యొడికట్టు చేమాటు నువిద నీటు బాహ్య కేళీకలాపరిపాకయై రతి- | కాంక్ష చూపులఁ దెల్పు కల్కి సొలపు నంకపర్యంకశయనసమయోపకం- | ఠశశికాంతచషకాంతరపటీర- పంకంబునకు నిగ్గి పైకి నించుక మ్రొగ్గి | చన్మొన లెదఁ దార్చు సఖియ నేర్పు | |
| గీ. | తలఁచినను గుండె జల్లని జలదరింప | నెట్టులోర్చితొ చెలియదీ వెట్టిదిట్ట- వైన నా రాధ చెయ్వు లిట్టట్టుసేయు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 35 |
| సీ. | పిఱుఁదుగుట్టు బయటఁబెట్టు వల్పెంబు గ- | ట్టి బిగువురవి దొడిఁగి పొడవగు నిండుజరీచెట్ల నీటుపైఁటచెఱంగు | నేటవాలుగ మొలనిడి కుదురుగ చేర్చుక్క నించి పసిడిగాజులు బిగించి | యందెలు మొఱయంగ సందిదండ- లు చలింప నెన్నుదురు చెమర్ప వగ వెల- | ర్పఁ గవును నులియంగ వగ చెలంగ | |
| గీ. | కులుకుచుఁ గడాని చిమ్మనఁగ్రోవిఁ బూని | నిగ్గు వెదచల్ల గుంకుమనీరు చల్ల నెదురుకొని వచ్చు రాధ చెల్వెన్నఁ దరమె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 36 |
| సీ. | బరణికప్పుల లక్క భాసిల్లు విధమున | గబ్బిగుబ్బలు కంచుకమునఁ దనర నిసుకదిన్నియలపై నెసఁగు నీరెండ కై- | వడి నితంబమునంటి వలువ సెలఁగ తుమ్మెదచాలుపైఁ దొఱఁగు పుప్పొడి రీతి | నూగారుపైఁ బైట బాగుమీఱఁ బొండమ్ములందుఁ గెంపులు నింపినటువలెఁ | బదములఁ గుచ్చిళ్లు గుది నటింప | |
| గీ. | నెమ్మి చెల రేగి కుంకుమనీటఁ దోఁగి | యలఁత లెడలించు జలకేళి కఱుగుదెంచు రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 37 |
| సీ. | రాణించు నెఱజంటరవికపట్టీ నంటి | ముత్తరుల్ దొంతరై బిత్తరింప జిగికుసుంబావన్నె చీరకుచ్చెల చెఱం- | గంచు లంచలకచ్చు లచ్చుపడఁగ కుదురులై యెద నిండుకొనెడు గుత్తపుగుబ్బ | లుబ్బి క్రేవకుఁ బైట నొత్తగింప విరులు జల్లున రాల వేనలి యిట్టట్టు | చలియించి మెఱుఁగుచెక్కులకు డిగ్గ | |
| గీ. | నందియలు మ్రోయ వేఁడుక లలరఁజేయ | బడలికలు పాయ చెలులు పావడలు వేయ కడఁగి నీతోడఁ జెండ్లాడు గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 38 |
| సీ. | చెక్కుఁ జెక్కునఁ జేర్చి చెయి ప్రక్క మఱలించి | గుబ్బలు ఱొమ్మున గూరిచి తొడ- పైనిఁ జేర్చి యలసి పవళించునెడ నీవు | చిటిపొటిసేతలఁ జెలఁగుచున్న నించుక సిగ్గు నొకించుక జగ్గించు- | క సొలపు నొక్కించుక జలు పించు- క యులుకు నొక్కించుక కులు కించుక యుసీ- | త్కృతి యొకించుక హుంకృతి చెలంగ | |
| గీ. | నలరుఁ జెక్కుల లేనగ వంకురింప | నెట్టకేలకు కనుఱెప్పలెత్తి చూచు రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 39 |
| సీ. | ఒక మూఁపుపై రుమా లొకమూఁపుపై సరా- | లరజార నలరారు హవుసుమీఱఁ గేల్తలాడఁగ నొత్తిగిలి తొడల్చేర్పుల | జిలిబిలిపలుకులు గులుక చేయి మార్పులఁ బొదవి కోల్మడుపు నొక్కునెడ కె- | మ్మోవులఁ దగులు పల్మొన చుఱుకుల కులుకుచు సీత్కృతు ల్వెలయించుచును గిలా- | ర్చుచుఁ గికాకిక నగుచు నొకరినొక- | |
| గీ. | రూరడింపుచుఁ గదియుచు నోసరిలుచు | నొద్దికలు మీఱి, బకదారియుద్దిఁ గేరి, యలరినావయ్య రాధతో నలరుశయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 40 |
| సీ. | ఆ రాధ వెతల చల్లార్పుల, వేడ్కనో | లార్పుల, రెప్పలల్లార్పుల, నగ- వు కిలార్పుల, జెమటార్పుల, నెద సేదదే- | ర్పులఁ, గలయికల నేర్పుల, తొడదొడఁ దార్పుల, మెయిమెయిఁ జేర్పుల, మోవిమా- | ర్పుల, మోడి తీర్పులఁ, బులుపులు గొలు- పు తలఁపు, వలపువిల్బూనువాని కలన | సంధింపఁగాఁ జేసె నకట! నీకు | |
| గీ. | వేగిరంబెంత? వెఱఁగెంత వేసటెంత? | వెల్లఁబాటెంత? వెగటెంత, వేఁగుటెంత? యువిద నొకయింత యెడబాసి యున్నయంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 41 |
| సీ. | తఱిఁజూచి జుంటివాతెఱఁ జుఱుక్కునఁ బంటి- | మొనఁ బట్టి గంటుసేయనె తలంచు, నబ్బినప్పుడె చేత నల్లనఁ జెక్కుపైఁ | గొట్టి కోర్కిని ముద్దుఁగొనఁగఁ దలఁచు, దక్కినంతనె తాఁ జివుక్కునఁ బైకొని, | కఱఁగి హా యని సొక్కఁగను దలంచు, ననువనైనయెడ ఖచిక్కున చన్మొనల ఱొమ్ము | గ్రుమ్మి, కౌఁగిటఁ జేర్చుకొనఁగఁ దలఁచు | |
| గీ. | గదర, నినుఁ జూచి యా రాధ కంతుబాధఁ | బలుకు వినువేళ సాము చొప్పడెడువేళ మంతనమువేళ ప్రక్క మార్మలయువేళ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 42 |
| సీ. | తమకించి యధరామృతంబుఁ గ్రోలఁ గడంగ | నెమ్మొగం బటుసేయు నెపముఁబూని యధరంబునకు నడ్డమగు నత్తుముత్తెంబు | నోరఁ గావించెడు హొయలు దలఁచి దుడుకుఁగా గుబ్బచన్నొడయఁగాఁ గమకింప | నోసరిల్లెడులీల నొక్కకేల రవిక ముడి సడల్చు రహిఁ దలంచి నిగుడి | చెక్కిలి ముద్దాడ సిగ్గుఁ గదిరి | |
| గీ. | వదన మరవంచుకొను రీతి వదలి చెక్కు | లలముకొను కొప్పు సవరించు చెలువుఁ దలఁచి మఱతువే యిందుముఖి పొందు మనమునందు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 43 |
| సీ. | ననుఁ జెందు జనులందు నెనరొందు ననుకొందు | వదియెల్ల కల్లసు మ్మరసిచూడ నలనాఁడు మధురకీ వరిగెడుపైనంపు | గుసగుసల కదరు గుండెతో గ- దురునూరుపులతోఁ జెదరు ముంగురులతో ను- | దురునఁ గ్రొంజెమటలతో నిలిచిన మ్రొక్కి గ్రక్కున నొక ముద్దిచ్చి సెలవియ్య- | వే! యని వేఁడుచు నెదను జేర్ప | |
| గీ. | నమ్ముకొని నీకుఁ జనుదోయినిమ్మపండ్లు | కాన్కగా నిచ్చి సెలవిచ్చి కడఁక ననుప నరిగి కలనైనఁ దలపోయవైతి రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 44 |
| సీ. | అందెలు మొఱయంగ నతనుపట్టపుదంతి | పగిది రాఁ గని నీవు పవ్వళించి యట్టురా నిట్టురా నటుమోమయినఁ జూచి | తలయూచి యశ్రులు దలకొనంగ నిట్టూర్పు నిగిడించి కట్టల్క వలకేలి | సందిదండ చలింపఁ గుందనంపు గాజులు రొదలీనఁ గ్రక్కునఁ బ్రక్కఁ గ్రొ- | మ్మెఱుఁగు సోగ జరాన నొఱ వెడలుట | |
| గీ. | పోలఁ జన్మొన నానుకోఁబోవ నుఱుక | నొడిసి చేఁబట్టుకొని రాధ నూఱడించి తరయ వెఱపింపఁబోయి తా వెఱచునట్లు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 45 |
| సీ. | మాటికిఁ జెలియిచ్చు మడుపులఁ గైకుంద- | నంపుగాజుల నిగ్గు సొంపునింపఁ జెలికత్తె కైదండఁ జెలఁగు దాఁపలి కేలి | రతనంపుటుంగరా ల్రంగులీన హొయలౌ ననుచు నెచ్చెలి “యెలా బలే”యన | ముఱిపంపుటెలనవ్వు మొలకలెత్త సఖులకు సెలవీయ జడబెడం గడరంగ | పెడమర్లు హొయలు పింపిళ్లుగూయ | |
| గీ. | సరుల మెలిఁదీర్చి పయ్యెదఁ జక్కఁజేర్చి | సిరులఁ గడుహెచ్చు పడకిల్లు చేరవచ్చు రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 46 |
| సీ. | మూఁపున జారు క్రొమ్ముడిలోని చెక్కిలి | కళకు హొంబట్టు మేల్గట్టు గాఁగఁ, బిఱుదఁ జేర్చిన కేల మిఱుమిట్లు కొనుగోళ్ల | తెలినిగ్గు సేసముత్తెములు గాఁగ, పుటముబ్బి ఱవికెకకప్పుల గుబ్బతిలు గబ్బి- | గుబ్బచన్నులు పూర్ణకుంభములుగఁ, గడలకై త్రిప్పు క్రేఁగంటిచూపుల బెళ్కు | వలపుఁ గప్రంపు నివాళి గాఁగ, | |
| గీ. | వచ్చి నీరాకకై దరవాజతలుపు | క్రేవ ఠీవిని నిల్చి రాధావధూటి యెదురెదురుఁ జూచు మదిఁ గోరి యెమ్మె మీఱి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 47 |
| సీ. | కుచ్చులు దువుముడిగొని వ్రేలు మేల్జరీ- | త్రాళ్లఁ జెలంగు బుర్సామెఱుంగు- కుచ్చుల తొడ బెడంగుఁ గడవ మొలఁ జెక్కి- | న పసిఁడివ్రాతపని పయిఁటచెఱఁ- గించుక జీరాడ నింపొసఁగ కొనవం- | కలెసఁగు నసదు చెంగావిచెట్ల పావడ జిగిచీరపై దువాళింప నం- | దెల రవరవ దౌదవుల చెవుల | |
| గీ. | చవులు దవులఁ, గల్వలదొరచట్లమెట్ల | వెంబడిగ రాధ కేళిసౌధంబుఁ జేర వచ్చు చెలు వచ్చుపడ నోర్వవశమె నీకు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 48 |
| సీ. | మేఘంబుఁ గదిసి క్రొమ్మెఱుఁగు తళుక్కను | లీల నీలపుకిటికీల మ్రోల నిలిచి నెచ్చెలులకు సెలవొసంగెడువేళ | నోరగా దిండుపై నొత్తిగిల్లి చెలినోర్తు మదిఁ గూర్చి చెక్కిటఁ జే చేర్చి | చింతింపుచుఁ బరాకుసేయు నిన్ను గని, మును తన్నంతటనె చూచిరావె నా | ప్రాణేశ్వరీ! యంచుఁ బారఁజాపు | |
| గీ. | చెలువుఁ డిదియేమొ యంచు నెచ్చెలుల నొక్క- | కంట నిన్నొక్కకంటను గాంచు రాధ చూపు మరుతూపులకుఁ బ్రాపుఁ జూపుఁ గదర | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 49 |
| సీ. | చెదరు కస్తురిబొట్టు కుదురు కొల్పెడునట్లు | మొగమెత్తి మోమున మోముఁ జేర్చి, కెలన నున్నంత దిక్కులు పరికించి చె- | క్కుచెమటఁ గొనగోటఁ గొని విదిర్చి, యెటకేని చనుచు నొక్కించుక వెడమళ్లి | సోకిసోకమిఁ బైటఁ దాకఁజేసి, యలుకఁ బల్కమిఁ బల్మొనల పెదవి మడచి | కీల్జడఁ బూని హుంకృతి నదల్చి, | |
| గీ. | యిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుపెఱుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు నించువిలుకాని యెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 50 |
| సీ. | ఎదురైనచో దారి కిట్టట్టు దొలఁగక | ఉదుటు చన్మొన లెద నదిమి గదిమి, చేర రమ్మని కాసెచెర గుగ్గుఁ దీర్చు కై- | వడి వాఁడికొనగోరు తొడఁ దనర్చి, మునిపంట మడుపందుకొనుమంచుఁ గదిసి వా | తెర సోకఁ బల్మొన చుఱుకులుంచి, దరినున్న తరిని మైవిఱుపు వీలుగఁ గేలు- | గవ మూఁపునకుఁ జేర్చి కౌగిలించి, | |
| గీ. | యిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుపెఱుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు నించువిలుకాని యెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 51 |
| సీ. | ఒకవేళ దోర్మూల చకచక ల్విలసిల్ల | విరులవీవనఁ బూని విసరి విసరి, యొకవేళ సందిటి పికిలిచెం డ్లల్లాడ | నలరునూనియఁ దల నంటి యంటి, యొకవేళఁ గొనగోళ్ల చికిలిడా ల్తిలకింప | దులకింపఁ బెన్నెరుల్ దువ్వి దువ్వి, యొకవేళఁ గరతలద్యుతులు పేరెమువాఱ | నిచ్చగా మడుపు లందిచ్చి యిచ్చి, | |
| గీ. | నిచ్చనిచ్చలు నీరీతి నీకుఁ దనదు | చెలువు దీపింప నుడిగంబు సేయుఁ గదర! తోరమగు ప్రేమ రాధావధూలలామ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 52 |
| సీ. | మొకరి తుమ్మెద మూఁతి ముట్టని క్రొవ్విరి | కోయిల వాచవిఁ గొనని చివురు చిలుకముక్కున నొక్కు చెందని బింబంబు | మెఱసిపోవక నిల్చు మెఱుఁగుఁదీవ కసటువోఁ బన్నీటఁ గడిగిన జవ్వాది | చొక్కమౌ గోవకస్తురి బిడారు, కలికిరాయంచ క్రేగంటఁ జూడని తూఁడు | పైపొర విడని కప్రంపుటనఁటి, | |
| గీ. | చిత్తజు మిటారి గేదఁగిచిక్కటారి | కమ్మవిలుకానిజుల్మతీ కత్తలాని కాయజోపనిషద్గాథ కదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 53 |
| సీ. | నెఱిలేక యొకవేళ నీటుగా నిలుచున్న | మడుఁగుగడంగు నున్దొడ బెడంగు సొమ్ములే కొకవేళ నెమ్మెమై నిలుచున్న | మిసిమిఁ జెలంగు నెమ్మెయి వెలుంగు ఱవికలే కొకవేళ హవుసుగా నిలుచున్న | పయ్యెదఁ బొంగు గుబ్బల మెఱుంగు ముడికొల్ప కొకవేళఁ దడియార్ప నిలుచున్న | పిఱుఁద నెసంగు పెన్నెఱుల రంగు | |
| గీ. | తన తళతళలఁ దన ధగధగలఁ దన ని- | గనిగలఁ దన చకచకలఁ గదిసి యిట్లు వెత గొలిపె రాధ యవయవద్యుతుల నిన్ను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 54 |
| సీ. | వలసినయెడల నవాతు వాతెర మోపి, | వదలు కౌగిళ్లను బొదలి పొదలి, నునుమోవి సోకిసోకని పల్చుఱుకు నించి, | యసివోవఁ గొనగోట నంటి యంటి, తొడలు పైఁ గదియించి తోడుపా టొనరించి, | సేదదీఱుట కెదఁ జేర్చి చేర్చి, యలసినవేళ మీఁదై చుల్కగాఁ గూడి, | చిటిపొటి గిలిగింత చేసి చేసి, | |
| గీ. | యిచ్చనిచ్చలు నీరీతిఁ బెచ్చుపెఱుఁగు | మచ్చికలు చేసి పచ్చహుమావజీరు కలన నినుఁ దీటుకొలిపెను గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 55 |
| సీ. | కులుకు సిబ్బెపు గబ్బిగుబ్బ లుబ్బడగ మైఁ | జేర్చి కూకీరవాల్ సెప్పి సెప్పి, కుందనపుం జాయ గొనబూను తొడ లవి | నొవ్వఁ గేలను బట్టి నులిమి నులిమి, కొదకెడు తఱిఁ గాంచి పెదవిచక్కెరముక్క | మచ్చికలొప్ప నందిచ్చి యిచ్చి, గడియసేపుకుఁ గాఁచి కదియరాఁ దలయూఁచి | చూపు జంకెనవాడిఁ జూపి చూపి, | |
| గీ. | యెసఁగు జడవేట్లఁ జదువున కియ్యకొలిపి, | శిక్ష గావించె మరువిద్యఁ జిన్ననాఁడు దేవరకుఁ గూర్మితోడ రాధావధూటి | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 56 |
| సీ. | కలికి నెమ్మెయి సాముకంబంబుఁ బెనఁగించి, | మోవిమార్పుల వెన్క మొగ్గు నిల్పి, కలయికఁ దారుమారుల డింకిఁ దొలఁగించి, | మిసిమి నున్దొడలఁ గొక్కెస ఘటించి, కొనగోటఁ జిక్కటా ర్మొనవైరిఁ గావించి, | పొలయల్క మార్మోము తొలఁగఁ దెలిపి, రాణించు కీల్జడ రాణావిసరుఁ జూపి, | చక్కిలిగింత హెచ్చరికఁ దెలిపి, | |
| గీ. | యెదను గుబ్బలకుంకుమ యెఱ్ఱమట్టి | నిలిపి తన చెల్వుగరిడిలో నీకు మరుని- సాము గఱపిన బిరుదువస్తాదు రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 57 |
| సీ. | ప్రక్కమో మటుచేసి పవళింపఁ దొడనాని, | యిటుమొగం బగుమని యెచ్చరించి, తనమొగంబుగఁ జేసికొని గ్రుచ్చి కౌగిటఁ | గదియించి పలుకెంపుఁ బెదవి నుంచి, యుద్దిలో మీఁదగు గద్దరిపికిలి కై- | వడి డింకికొను పారువంబు కరణిఁ, బైఁ దొర్లి పేరెదఁ బవళించి ఱొమ్ముల | పొగరడంగఁగఁ గసిపోక లేచి, | |
| గీ. | కొప్పు సవరించి, చేర్చుక్క కుదుర నించి, | సరులు మఱలించి, మగలాగు సలుపు రాధ హొయలుఁ దలపోసి నీ వెటులోర్తు వహహ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 58 |
| సీ. | ననఁబోడి పొ త్తది తనరక భుజియింప | నొల్లవుగా యొంటి నోగిరంబు పైదలి నునుదొడపైనఁ జేర్చినఁ గాని | రాదుగా కంటికి రాత్రి నిదుర బాల యందెలరవ మాలకించినఁ గాని | యాపఁజాలవు గుండె యదురుపాటు నలివేణి మునిపంట నందియిచ్చినఁ గాని | యందుకో లేవుగా యాకుమడుపు | |
| గీ. | గాటమగు ప్రేమ మది నాఁడు నాటఁ బట్టి | నెట్టుకొని యల్ల రాధపైఁ బుట్టె నిట్టి మమత, నేఁ జెల్ల! తన చెల్వు మచ్చుఁ జల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 59 |
| సీ. | నెఱులు చిక్కెడలించు నెపమునఁ జేయెత్తఁ | గక్షదీధితులు చీకాకుపఱుప, పనిలేని పనిఁ బల్కు నీ పల్కుల పానకం | బొదవి కెంబెదవి నోరూరఁజేయఁ గైతప్పి పడు బంతికై తగ్గు జగ్గునఁ | తరుల బిత్తరము తత్తరము నింప, నొఱపుగా మైనిక్కు నూనఁ బిక్కటిలు ఱొ- | మ్ములవి చాల విరాళి మొనయఁజేయ | |
| గీ. | గాటమగు ప్రేమ మది నాఁడు నాటఁ బట్టి | నెట్టుకొని యల్ల రాధపైఁ బుట్టె నిట్టి మమత నేఁ జెల్ల! తన చెల్వు మచ్చుఁ జల్ల | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 60 |
| సీ. | శయ్యనొయ్యన నతిశ్రమ మీఱ నొకయోర | నోరగా గూర్చుండి యొరఁగి రాధ యూర్పులు డాచేతి దార్పులు నీకబ్బ | గేల్దమ్మి చెక్కిటఁ గీలుకొలిపి నుదుటి క్రొంజెమటబిందువులు పాపటఁ జేరు | ముత్యాల కొక క్రొత్తమురుపు హత్తఁ జెక్కుటద్దములపైఁ జేర్చిన నీలంపుఁ | దళుకన జాఱుకొ ప్పలమికొనఁగ | |
| గీ. | నర కవుఁగిలింత యినుమడి యావులింత | మైవిఱుపొకింత నిద్దురమబ్బు కొంత కలగలుపు గాఁగఁ గడువింతఁ జెలఁగెనంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 61 |
| సీ. | కబరీభరము వీడి కడుహొయల్నెఱపుచు | డామూఁపుపై చొకాటంబు నింపఁ, బొరిపొరిఁ బుచ్చు నూర్పులసారె చనుదోయి | నిక్కి పయ్యెదపైనఁ బిక్కటిల్ల, సొంపున నరసొక్కు చూపులచే నిక్కు | బెళుకు కన్గ్రేవల బిత్తరింప, నొఱఁగి నీ భుజపీఠి నూనిన చెమటఁ గ్రొం- | దళ్కెక్కు చెక్కుటద్దంబు గులుకఁ, | |
| గీ. | గోరికలు పండ నొకదండఁ గూరుచుండ | రాధ మైదోపు జిగుల రారాపు మెచ్చు కోపు నీ చూపు తరితీపుఁ గొలుపనోపు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 62 |
| సీ. | అలిగి నీ వటుమొగంబౌచును సెజ్జపై | కే ల్తలాడఁగ నొత్తిగిలిన, వేఁడు- కొను రీతి నుదుటుఱొమ్మున వెన్ను నదుమఁగాఁ | జయ్యన దాని కీల్జడను బట్టి, కదియ రాఁ దివిచి సొంపొదవించుచును దానిఁ | దగఁగ నెన్నొవిధాలఁ దనివిపఱచి యుగ్గడించుచు దాని యొప్పుల కెదసొక్క | గిలకిల నగుచును వెలయునట్లు | |
| గీ. | నిచ్చనిచ్చలు నీరీతిఁ బెచ్చుపెఱుఁగు | మచ్చికలు చేసి పచ్చహుమావజీరు కలన నినుఁ దీటుకొల్పెను గదర రాధ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 63 |
| సీ. | తెరతెర తియ్య వాతెరకొఱుకు మఱిగి | పల్గొన లేవేళఁ బలువరింపఁ, బలుమొన చుఱుకుసోకుల బారి గడిదీఱి | తియ్యవాతెర తరితీపు సేయఁ, గ్రొవ్వాఁడి నునుగోటి కొనపోటు మచ్చిక | నుదుటుఱొమ్ముల నెదురెదురుఁ జూడ, నుదుటుఱొమ్ముల నెదురొత్తు పొత్తున హత్తు | క్రొవ్వాఁడి నునుగోళ్లు కోరికొనఁగ, | |
| గీ. | నిట్లవయవంబులు దమలో నెనయఁ గోర | రాధఁ గని నీవు, నినుఁ గని రాధ, తాల్మి నిల్పుటలు లేదుగా యొక్క నిముసమైన | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 64 |
| సీ. | నొసటిపై నెసఁగు క్రొమ్మిసిమి లత్తుకజొత్తు | పువుఁబోఁడి జాడ దౌదవులఁ జెప్పఁ, బ్రక్కసందిలిదండ పెక్కు లెక్కువలౌచు | బిత్తరికౌఁగిళ్ల బిగువు దెల్ప, కుదురులై యెద హత్తుకొనిన కుంకుమముద్ర | లింతిగుబ్బల కుదు రేరుపఱుప, నఱుత నురల్చిన యరుణంపు జిగికెంపు | వెలఁది పైకొనుట వెన్వెంటఁ జాట, | |
| గీ. | తనరు నీ జగ్గు మును సిగ్గుఁ గొనుట యెగ్గు | మీఁద మిక్కిలి క్రీడించి మెలఁగితేని సారె కా రాధగుట్టు మోసాలఁ బడును | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 65 |
| సీ. | పలునొక్కులకు నోసరిలు చెక్కునను జెక్కు | నధరంబుఁ గదియంగ నద్దుముద్దు, దుడుకుసేతకు సారె సడికొట్టు కైవడిఁ | బెనుచు వాతెర, పయిఁ బెట్టు మట్టు, నీటుగా వగఁబూను నెపమునఁ దివిరి దాఁ | జూచుచు ఠీవిని జూపుకోపు, కులుకుగుబ్బల డాఁచికొను హొరంగున నీవి- | పైఁ బరాకొక్కింత బఱపునొఱపు, | |
| గీ. | మాటిమాటికి గిలిగింత మమత వొడమ, | నులుకు వగలింపు నెదురింపు లొదవ రాధ, యలుకకూటమి చవిఁ దేల్చెనయ్య నిన్ను | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 66 |
| సీ. | మరుఁడేచఁ దమిఱేచ మనమాఁగినను వీఁగి | వలపాగి చెలరేఁగి పైనివ్రాలి, కళదేర నెలలూర నలరారు చెక్కిటఁ | గొనగోటి మొననాట గుఱుతులుంచి, జిగిగుల్క వగచిల్క సెగలొల్కఁ గనుమ్రొగ్గ | నెదపైని యెదనాని యదిమి గదిమి, శ్రమజాఱ వగదీఱ రహిమీఱ మెల్లన | మునిపంట చుఱుకంట మోవి యాని, | |
| గీ. | యించువిలుతుని కేళి దనియించి తనిసి | రాధ మదిదీఱ దొంతర రతులఁ దేఱి మఱలఁ దమకించి నినుఁ గాంచి ముఱుపుఁ జూపు | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 67 |
| సీ. | ఆణిముత్తెపునత్తు హవుసుగా సవరించి, | రతనాలబేసరి జతను పఱచి, బసుమాబుటేదారు బలుఫేషు వాజుపై | చెంపఖల్లీ రుచుల్ చిందుఁ ద్రొక్క సొగసైన బిందీలు తగు చేరుచుక్కతో | నుదుటిపై నాడుచుఁ బొదలుచుండ సెసిపువ్వు రాఁకడి యసియాడ జడ చాల | పిఱుఁదుపై హొయలునఁ బెనఁగొనంగ | |
| గీ. | నుదుటువక్షోరుహంబుల హొయలు నింప | యుపరతుల నిన్ను వింతగా నోర్చు తరుణి యున్నతిని జూచి నీ వెటులోర్తు వహహ! | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 68 |
| సీ. | ఆణిముత్తెపుసరుల్ హవుసుగా సవరించి | రతనాలపోచీలు జతను జేసి బసుమాబుటేదారు బలుఫేషు వాజుడా | లొలయంగఁ దొడలపైఁ కుబికి నిలిచి “నిబ్బరంబుగఁ జూడు నేఁడిదే నా తమా- | షా” యని, చెలరేగి చాల నలసి యఱచూపుతోఁ జూచి యనురక్తి లజ్జించి | ముసిముసినగవున మోము వంచి | |
| గీ. | నన్నుఁ గైకొనుమంచుఁ దా సన్ను తించి | యొక్కచేఁ బట్టి బతిమాలి హొయలుమీఱ జెలఁగి యొకచేత ఖుర్ణీషు చేసినట్టి వగఁదలఁచుకొన్న నెట్లోర్తు మగలమిన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 69 |
| సీ. | విరజాజివిరులతో నరజారు పెన్గురుల్ | పిఱుఁదుపై మాటికిఁ బెనగొనంగఁ, దోరపుఁబల్కుతోఁ దొయ్యలి తమిచేత | మనసులోఁ గోర్కులు మసగొనంగఁ, సొగసైన జాళునా తగు గుమ్మటీల్డాలు | నునుపుఁ జెక్కిళ్లతో నెనయుచుండ, నాణిముత్యపుసరు లలరు మల్లెలసరుల్ | బిగువుగుబ్బలమీఁదఁ బెనఁగొనంగ, | |
| గీ. | సరుల మెలిదీర్చి పయ్యెదఁ జక్కపఱచి | సిరులఁ గడుహెచ్చు పడకల్లుఁ జేరవచ్చు రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 70 |
| సీ. | అలవోక యువిదదౌ వలుకులు వినవచ్చు | తడవుగా వినఁ జెవిఁ బడఁగరాదు నిలిచి చూచినబోఁటి నెమ్మేని జిగి దోఁచు | గనుఱెప్ప లల్లార్పఁ గానఁబడదు కోరినఁ బ్రోయాలు గొనబు మేనది తోచు | దాసిచే నంటఁగఁ దగులువడదు యాగుబ్బుగాఁ గొమ్మ యంగవాసన వచ్చు | నరసి మూర్కొన్నచో నటమటించు | |
| గీ. | సేఁపు నను గ్రోల సకిమోవి తీఁపుసోఁకు | మరులుకొని చేరఁ బిలిచిన మాయమగును మోహభారంబొ? విరహంపు ముమ్మరంబొ? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 71 |
| సీ. | మగరాల బిందీలు సొగసుగా రాణించు | నల చేరుచుక్కతో నందగింప తళుకుగుబ్బలమీఁద ధగధగమనియెడి | చంద్రహారంబులు చౌకళింప బాజుబందుల ఠీవి పైఠాణిరవికతో | బిగిగబ్బిపాలిండ్లు పిక్కటిల్ల కరపల్లవంబునఁ గళుకు లూఱఁగఁజాలు | రతనాలపోచీలు రవళి నింప | |
| గీ. | పైఁట సరిగంచుపావడపై నటింప | చిలుక పలుకులతోడ నెచ్చెలిని గూడి- యున్న సఖిఁ జూచి నీ వెట్టులోర్చితయ్య | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 72 |
| సీ. | జిలుగులాహిరిదారు బలుకినేరా జరీ | వజమీఱు బలుఫేషు వాజుఁ దొడిగి, రాణించు వేణిపై రతనాలరాఁకడి | తళుకులు ముసుఁగునఁ గళుకులూర, హురుమంజిముత్యముల్ హొయలుగాఁ గూర్చిన | చంద్రహారంబులు చౌకళింప, జాతిడాల్గల బులాకీ తేఁటకెంపుల | మిన్నాకళాసిగీ వన్నె మీఱ, | |
| గీ. | నతులితంబైన యవయచద్యుతుల నెన్ను | చెలియ సవరించి ఖుర్ణీషు చేసినట్టి రాధ వగఁ గన్న మది నిల్పరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 73 |
| సీ. | జాళువాబంగారుసరిగతో రాణించు | జిగికుసుంబావన్నె చీర కట్టి పొందమ్ములందు కెంపులు చెక్కినట్లున్న | రంతుపాణీవన్నె రవికఁ దొడిగి సంపఁగినూనెచే జారుగా మెఱుఁగాని | వేణిపై రాఁకడి వెలయఁగూర్చి పసుపునిగ్గులమీఁద నెసఁగు పెన్మెఱుఁగుతో | నోఱచూపులు చెక్కు లొఱసిపాఱ | |
| గీ. | బోటి హొయలుగ నాలవనాఁటి నీటు | మొనయ ముఱియుచు నినుఁ జూచి మోము వంచు మేడలో నీవు నొకచెంత మెలఁగునంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 74 |
| సీ. | నిలువుముకురముల నికరములకళాసి | గీగోడమేడలోఁ గేళిశయ్య నిదురింపఁగ తలాడ నిల్పి నిద్దంపుఁజె- | క్కిటను గోరునుప నుల్కిపడి లేచి నెదురఁ గుదురుగం జెన్నొదవు నినుం గని | ముద మెదఁ బొదలఁగా మదవతియును దగునట్లు కిలకిల నగి తిరిగి కిలకిం- | చితమున హాసముఁ జేయుచుఁ గది- | |
| గీ. | సి తమిదొట్టిచే మెల్లనఁ జెక్కుగొట్టి, | పలుపెదవినుంచి నిక్కు నా కులుకులాడి రాధఁ గనకున్న క్షణ మోర్వరాదురన్న | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 75 |
| సీ. | రతనాల చేర్చుక్క జతకూడి బిందీలు | పొదలు నెన్నుదుటిపై ముదము మీఱ జెంపఖల్లీ లందగింపఁగాఁ గుచమధ్య- | హారముల్ ప్రక్కల నడరి మెఱయ సందిటి మేల్బాజుబందుబంతులు క్రింద | నందంద యెగసి యుయ్యాలలూఁగ రాఁకడి సెసిపువ్వురంగు పైని చెలంగ | జడబెడంగు పిఱుందఁ దడఁబడంగ | |
| గీ. | నాణిముత్తెపునత్తు దా నలరుచుండఁ | గంకణంబులు గలహంస గతుల మ్రోఁగఁ గలికి రతిసల్పు మొలనూలు గల్లురనఁగ | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 76 |
| సీ. | అంతటఁ జూచిరమ్మని బాఁజాచి క- | న్గవ మూఁపులకు నించి కౌగిలించు బటువైన గబ్బిగుబ్బలజో డెదను నాట | బిగువుమై మైఁజేర్చు బ్రేమఁ గూర్చు దక్కితివింక నాథా యని జడఁజుట్టి | కట్టివైతునటంచు గరిమ నించు మునిపంటిమొన నాట మొనసి వాతెర తేట- | లెమ్మె మీఱఁగఁ గ్రోలి యెసకమెసఁగు | |
| గీ. | నిచ్చనిచ్చలు నీరీతి పెచ్చుఁ బెరుఁగు | దుడుకుసేతల రాధావధూటి నీకు నించువిలుకానియెలగోలు సంచుఁ దెలిపె | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 77 |
| సీ. | ఆ రాధ వాతెర యామతింపుల, నందె | మొఱయింపుల, హవణింపుల, నద నెఱి- గింపుల, నర గనుపింపుల, మయి పుల | కింపుల, నలుక రెట్టింపుల, నగి- యింపుల, నలుక వారింపుల, వదలని | యింపుల, నాదరింపులను గొలుపు పొలుపు, వలపువిలుఁబూనువాని కలన | నందింపఁజేసెఁగా నహహ! నీకు | |
| గీ. | వేగిరంబెంత? వెఱఁగెంత? వేసటెంత | వెల్లఁబాటెంత? వెగటెంత? వేఁగుటెంత? యువిద యొక యింత యెడబాసి యున్నయంత | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 78 |
| సీ. | జిలుఁగుబుటేదారుచీరపై నపరంజి | గంటలు మొలనూలు గల్లురనఁగ, రవికాంతి హవణించు రవికసందిలి బాజు- | బందుల మేల్కుచ్చు లందియాడఁ బాపట చేర్చుక్క పచ్చలబిందీలు | పొదలుచు నుదుటిపైఁ గదలుచుండ, రతనాలబేసరి జతను కెంపుబులాకు | నాణిముత్తెపునత్తు హవుసు మీఱ, కొదమతుమ్మెదగుంపు నదలించు కీల్జడ | యరవిరిపాన్పుపైఁ బొరలుచుండ | |
| గీ. | వలపులీడేరఁ గళలూర వగలు మీఱ | నడుము జవ్వాడ పిఱుఁదు లానందమొంద సరసముగ రాధ నీచెంతఁ బరఁగునంత సోయగంబెంత? సొలపెంత? సొక్కుటెంత? | సాహసంబెంత? సౌరెంత? సరసమెంత? వెఱఁగుపడుటెంత? యొకచెంత వెఱపు కొంత | చిఱుచెమటలెంత? శ్రమయెంత? సిగ్గు కొంత దాని వగలెన్న వాణీశుకైనఁ దరమె? | బళిర కఱివేల్ప! పసిఁడిదువ్వలువదాల్ప! | 79 |
| కఱివేల్పుశతకము సంపూర్ణము. | ||