| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
‘వేగ తాఁకు మైదువేల గుఱ్ఱంబులు | ద్రౌపదీతనూజతతియు నీవు శకుని ననుడు నతఁడు సంరంభజృంభియై | యట్ల చేయ ఘోరమయ్యెఁ బోరు. |
338 |
| వ. | అట్టి యెడ. | 339 |
| సీ. |
లీలఁ గట్టియతోడఁ గూలంగవైచియు | డొంకెనపోటులఁ బొంక మడఁచి పడఁ ద్రోచియును వాలఁ గడికండములుగ వ్రే | సియుఁ గఠారంబులఁ జీరి చెఱచి గీటడంగించియు గిట్టి యొండొరుఁ బట్టి | కొని మల్లుచందంబు ననికిఁ జొచ్చి నేలకు వంచియుఁ గేలిమై గళముపై | నెక్కియుఁ బెక్కండ్రు రొక్క మొగిన |
|
| ఆ. |
యెక్కుటయు సహించి యుక్కునఁ బెనఁగియు | నుఱక వివిధగతుల నుబ్బి చెలంగి బొమ్మలాడినట్లు పోరి యా రావుతు | లధిప! నెరయ మెఱసి రందు నిందు. |
340 |
| వ. | మఱియు ననేక ప్రకారంబుల భండనంబుసేసిరి. పదంపడి యమ్మాద్రీకుమారుని వీరోద్రేకంబునకు నోహటించి గాంధారీసోదరుం డాఱువేల తురంగంబులతోడం దిరిగె నతండును ద్విసహస్రహయశేషసేనాసమేతుండై యన్న కడకరిగె. నా సౌబలుండును జుట్టి వచ్చి ధృష్టద్యుమ్నుని మొనపైఁ బడిన నతండు సైన్యసముద్దండ సంరంభం బెసంగ విక్రమాటోపంబు సూపినయపుడు పంచసహస్రత్రిశతహయంబులు వడిన రౌద్రంబు రూపు దాల్చిన ట్లాయుధఖండనాస్థిభంజనశబ్దశ్రవణంబునను రక్తమాంసమేదోస్థిమస్తిష్క మజ్జాసమ్మేళన దారుణరణతలదర్శనంబునను దదీయ విస్రగంధాఘ్రాణంబునను యోధులు వీతచేతస్కులైరి. తెగినతల యొకచేతను నెత్తుట జొత్తిల్లిన కరవాలం బొకకరంబునను బట్టుకొని యట్టలాడినట్లు పెనంగి యా శకుని హతావశిష్టంబులైన సప్తశతాశ్వంబులతోడఁ దొలంగి యచ్చటి జనంబులతోఁ ‘గురుపతి యెచ్చట నున్నవాఁ డనిన వార లతని కిట్లనిరి. | 341 |
| ఉ. |
అల్లదె కంటె? పూర్ణశశియట్లు కడుం జెలువొందెఁ జూడఁ బే రెల్లి రథప్రతాన మదె యేపున సంగరకేళిఁ జాల శో భిల్లెడు నయ్యెడన్ రిపువిభీషణవిక్రమణప్రకారగా ఢోల్లసనుండు భూపతి మహోన్నతి నొప్పెడుఁ బొమ్ము చెచ్చెరన్. |
342 |
| వ. | అనిన విని తల యెత్తి చూచి తత్ప్రదేశంబున కరిగి యద్ధరణీశుం గని యతని కిట్లనియె. | 343 |
| క. |
‘పొలియించితి నే గుఱ్ఱం | బులఁ దేరుల కుఱికి యింక భూరిరయమునన్ బొలియింపవలయుఁ బ్రాణం | బులు డాఁచిన వశమె పాండుపుత్రుల గెలువన్. |
344 |
| వ. | రథంబులు గజంబులు దెగినం గాని కాలుబలంబుల సమయించుట పని గా’ దనిన నమ్మాటకు సైనికులు సంతసం బంది బరవసంబు సేయ నమ్మహీనాయకుండు సముత్సాహదోహలియై తఱిమిన మనమూఁకలు కడంక యెలర్ప దర్పస్ఫురితంబులగుచు నురవణించినం గని గాండీవి గోవిందున కిట్లనియె. | 345 |
| క. |
‘మొనసి చనుదెంచు దుర్యో | ధనసేనాసముదయంబుఁ దఱియ నురవడిం జననిమ్ము మన రథము నా | సునిశితబాణముల సమయఁ జూచెద దీనిన్.’ |
346 |