| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
తురగంబులతోఁ గూడఁగ | నరదము సకలంబు నుజ్జ్వలానలశిఖలన్ సురసురఁ బోయినఁ గని య | న్నరుఁ డచ్చెరువంది కృష్ణునకు నభిముఖుఁ డై. |
335 |
| వ. | వినయంబుతోడ మోడ్పుఁగేలు ఫాలతలంబునఁ గదియించి వినతుండై ‘దేవా! యిట్టి యాశ్చర్యంబుం గలదె? యీ రథంబు దగ్ధం బగుటకుఁ గారణం బేమి? నాకు వినందగునేని యానతి’ మ్మనిన మురారాతి యతని కిట్లనియె. | 336 |
| క. |
‘గురుకర్ణుల యస్త్రాగ్నుల | నెరిసినయది మున్ను; దీని నిటు గాకుండం భరపడి రక్షించితి; సం | గరము దెగినఁ దొలఁగి యిపుడు గాల విడిచితిన్.’ |
337 |
| వ. | అని చెప్పి యప్పు డద్భుతరసమగ్నులగుచున్న తక్కటి పాండవులం గనుంగొని యలరుమొగంబున నలంతినవ్వు కాంతి దళుకొత్తఁ గౌంతేయాగ్రజుం గౌఁగిలించికొని ‘యే నుపప్లావ్యంబునకు వచ్చి నినుఁ గనిన నీవు నాకు మధుపర్కం బిచ్చి వివ్వచ్చుఁ జూపి ‘వీఁడు నీకు రక్షణీయుండు సుమీ!’ యని యప్పగించి; తేనును నియ్యకొంటి; నట్ల నాసఖుండును సురక్షితుండై వీరక్షయకరం బగుమహాసంగరంబు భవద్భీమనకుల సహదేవసహితంబుగ నిస్తరించి జయంబు గైకొనియె; నిటమీఁదం జేయ వలయు కార్యంబులు నడపు’ మనవుడు నతం డచ్యుతున కిట్లనియె. | 338 |
| తే. |
‘ద్రోణకర్ణ దివ్యాస్త్రముల్ క్రూరభంగిఁ | గవియునప్పుడు మము నీవు గావకున్న బ్రదుకు టెంతద? వ్వధిక శుభంబులకు భ | వత్ప్రసాదంబు గని కాదె వాసుదేవ!’ |
339 |
| వ. | అని వెండియు. | 340 |
| క. |
‘మునిపతి కృష్ణద్వైపా | యనుఁడు ప్రబోధించె నన్ను ‘నచ్యుతుఁ డే ది క్కున నుండు నెమ్మి నా ది | క్కునకు జయము గల్గు’ నని యకుంఠితకరుణన్. |
341 |
| వ. | అనుటయు మాధవుం డమ్మనుజేంద్రున కిట్లనియె. | 342 |
| క. |
‘మనకుం గౌరవులకుఁ బదు | నెనిమిది యక్షౌహిణులు మహీశ్వర! కల; వ ప్పెనుమొన లన్నిటిలో న | ర్జునునకుఁ బాటి యని యొక్కరునిఁ బేర్కొనుమా! |
343 |
| తే. |
ఈశ్వరుఁడు క్రీడి కస్త్రంబు లిచ్చుచోట | ‘మత్సముండవు గ’ మ్మని వత్సలత్వ గౌరవంబునఁ బల్కె; నిక్కముగ నంత | వాఁడు గాఁడె నీతమ్ముఁడు వసుమతీశ! |
344 |
| చ. |
కరుణ జనించి శాత్రవుల గాండివి సంపఁగ నొల్లఁడయ్యె; నేఁ బరువడిఁ దెల్పి యైక్యపరిభావ నిరూఢము గాఁగఁ జేసినం దిర మయి పోరికిం గృతమతిన్ మఱి చొచ్చి సరిత్సుతాదులన్ వెరవున గీటడంచెఁ దనవిక్రమ మెందుఁ బ్రసిద్ధి కెక్కఁగన్. |
345 |
| క. |
అచ్చెరువు సంపుటకుఁ దన | యిచ్చఁ జొరక కేలి సలిపె నిన్నాళ్ళును వి వ్వచ్చుఁడు; హిత మేఁ జెప్పినఁ | బొచ్చెము లే కంతరంగమున నిల్పెఁ దగన్. |
346 |
| క. |
ఏ నుపదేశించితి ననఁ | గా నొక పెం పెంచినాఁడు గాని తలంపన్ మానవనాథ! సురేశ్వర | సూనుఁడు నాయట్టివాఁడ చు మ్మేపనికిన్. |
347 |
| క. |
నిమిషార్ధంబున ద్రైలో | క్యమును సురాఘరయుతంబు గా నోర్చుం గో పము పొడమినఁ గవ్వడి క | య్యమునం గురుబలము గెలుచు టరుదే తలఁపన్?’ |
348 |
| వ. | అని పలికె; నిట్లు సల్లాపసౌఖ్యం బనుభవించి వాహనమోచనం బాచరించిరి; తదనంతరంబ కౌంతేయులు గమనీయాభరణంబులుం గనకరాసులును రత్నసంచయంబులు మొదలుగా మహనీయవస్తు విస్తారంబునం బ్రస్తుతిపాత్రంబైన నీపుత్రు భాండాగారంబుఁ జేకొని, నాఁడు పొలికలనికిం బోవక యున్న రథరథ్యమాతంగ తురంగంబులం జూచికొని దాసదాసీకుబ్జవామనగణంబులం గైకొని, యధిక ప్రమదసమద చేష్టితంబుల నుల్లసిల్లిరి; కొండొకసేపునకు శౌరి వారలతో నిట్లనియె. | 349 |
| ఆ. |
‘వీడు పాడు గాన విశ్రాంతి కియ్యెడ | మనము మసలవలదు; మంగళార్థ ముగ శుచిప్రదేశమున కేఁగి యచ్చోట | నుచితవర్తనముల నుండవలయు.’ |
350 |
| క. |
అని చెప్పి పాండు నృపనం | దనులం దన తమ్మునిన్ ముదం బెసఁగఁగఁ దో డ్కొని పోయెను వసుదేవుని | తనయుఁడు శిబిరంబు వెడలి ధరణీనాథా! |
351 |
| వ. | ఇట్లు వోవునప్పుడు శౌరిసారథి యైన దారకుండు మున్నెప్పుడును విడిదలం దమతేరు నశ్వంబులనుం బరికించి యుండెడువాఁడు బోయలు నీకొడుకు మడువున డాఁగినయునికి చెప్పిన నయ్యెడకు వచ్చు కౌంతేయులతో వీడెల్ల నొక్కతలగా వెడలివేడుకఁ జూడం జనుదేరఁ, దాను నయ్యరదంబున శైబ్యసుగ్రీవ మేఘ పుష్పవలాహకంబులం బూన్చికొని వచ్చుటం జేసి తా నప్పుడు కౌరవ శిబిరంబునకుఁ దోడన యరుగుదెంచెం గావున నొదవి సుకల్పితస్యందనుం డై యుద్దామోదరుదృష్టిపథంబు నిల్చె; ధర్మనందనుండును దమ్ములును సాత్యకియును సముచితవాహనంబులు దెప్పించుకొని యారోహణంబు సేయ నన్నారాయణుండు నిజరథారూఢుం డై యత్తెఱఁగునం బోయి. | 352 |
| తే. |
ఓఘవతి యనఁ బరఁగిన యొక్క పుణ్య | తటిని చేరువఁ గల్గిన దానితీర భూమియం దర్హ మగుతలమున వసించి | రమ్మహాత్ములు చిత్తంబు లలర నధిప!’ |
353 |
| వ. | అని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రునకుఁ బాండవుల విజయంబు తెఱంగుఁ జెప్పె నని వైశం పాయనుండు. | 354 |
| క. |
జనమేజయునకు నిట్లను | విను మప్పుడు ధర్మసుతుఁడు విష్ణుని వదనం బునఁ జూడ్కి నిలిపి, ‘కరిపుర | మునకుం బోవలయు నీకుఁ బురుషార్థనిధీ!’ |
355 |
| వ. | అని ప్రార్థించె; ననుటయు నమ్మనుజపతి యమ్మహీసురవరున కిట్లనియె. | 356 |
| చ. |
‘అని ధృతరాష్ట్ర నందనుల నందఱ గీ టడఁగించి వేఁడి యా యనకడ కచ్యుతుం బనుపునంతటి కార్య విశేషమేమి గ ల్గెనొ? మునినాథ! యానృపతికిన్ మది నాకు వినంగ వేడ్క వు ట్టినయది యత్తెఱంగు ప్రకటింపు పరిస్ఫుటవాక్యసంపదన్.’ |
357 |
| వ. | అనవుడు నాసంయమి యిట్లనియె. | 358 |
| ఉ. |
‘కౌరవముఖ్యు ధర్మగతి గాని తెఱంగునఁ గ్రీడి పంపఁగా మారుతి గూల్చె నట్లగుట మాన్యచరిత్రుఁడు ధర్మసూతి గాం ధారి శపించు దీని విని త మ్మని యాత్మఁ దలంచి యిమ్మెయిం గూరినభీతి నవ్వనితకుం దగుభంగి శమం బొనర్పఁగన్. |
359 |