| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | పనిచెం గాని ధృతరాష్ట్రు నుద్దేశించి కా; దట యచ్యుతుం డరిగి యప్పటి కుచితం బగువిధంబునఁ గార్యంబు నడపె; నాకర్ణింపు; మట్లు దన్నుఁ బ్రార్థించిన నప్పురుషోత్తముండు పనితెఱం గడిగి, పాండవాగ్రజుండు సెప్ప విని, రథారూడుం డై యతిరయంబునఁ గరినగరంబున కరిగి, మొగసాల నిలిచి, యాంబికేయునకుఁ దనరాక యెఱిఁగించి పుచ్చి, తగం జొచ్చి యంతక మున్న గాంధారీద్వితీయుండై కొడుకులదెస వగలం బొగులుచున్న యమ్మహీకాంతునివలని కారుణ్యంబున నతనికడకుం జనుదెంచి యున్న కృష్ణద్వైపాయనమహామునిం గని వినయసంభ్రమంబులు దలకొనఁ దత్పాదంబులకుఁ బ్రణమిల్లి యక్కురురాజునకు గాంధారరాజనందనకు నమస్కరించి, కులపతిసన్నిధి యగుట నిలాతలంబునం గూర్చున్న యజ్జననాథు సమీపంబున నాసీనుండై. | 360 |
| ఆ. |
అన్నరేంద్రు పాణి యల్లన తనకరా | బ్జమునఁ గీలుకొల్పి బహుళబాష్ప కలితవదనుఁ డగుచు గళమున నెలుఁ గురి | యాడ వగచి యమ్మురాంతకుండు. |
361 |
| వ. | తత్ప్రదేశంబున నున్న కనకకలశజలంబుల ముఖప్రక్షాళనంబు సేసి యెలుంగు నూలుకొనం జేసి యిట్లనియె. | 362 |
| చ. |
అకట! కులం బకారణము యంతయు నాశము నొందె; నిట్టిదా నికిఁ జొర నొల్ల రైరి మహనీయచరిత్రులు నాఁడు పాండవు; ల్సకలము నీ వెఱుంగుదు చలంబును నీసును దక్కి నన్ను సం ధికి నిట రా నొనర్చుట మదిం దలపోయు మదెట్టిశాంతియో!’ |
363 |
| వ. | అని యంత నిలువక. | 364 |
| క. |
‘గెలువరె జూదము లెందును? | గలదే తలఁబట్టి పుణ్యకాంతఁ గొలువులో పలి కీడ్చి తెచ్చి వలువల | నొలుచుట? యే మనఁగవచ్చు నుర్వీనాథా! |
365 |
| క. |
దానికి నొచ్చినమనముల | తో నడవికిఁ బోయి బహుళదుఃఖంబుల న ట్లూని విరాటుపురిం బడఁ | గానియిడుమ వడియు వారు గనలర? కంటే. |
366 |
| ఉ. |
ఏవుర కుండ నొక్కొకటి యిమ్మని యూళులు వేఁడి కాన రై రే వలన దన్న నీ కొడుకు లెమ్మెయి మానర లోభ గర్వముల్; నీవును నట్ల కాక మహనీయమతుల్ విదురాదిబాంధవుల్ వేవురు సెప్పరే? యధిప! వింటె తగం బలు కొక్కఁ డేనియున్? |
367 |
| క. |
కాలోపహత మనస్కుఁడు | మేలు తెరువు వట్టు నెట్లు? మెయికొని యది యిం కేల తలపోయ? నుడుపం | జాలుదురే నరులు దైవసంపాదితముల్?’ |
368 |
| వ. | అని వెండియు నిట్లనియెఁ ‘బాండవులు గల్మషాయత్త చిత్తులు గామియు, మీరు నెఱిలేమియు విచారింపుము; మేను మ్రొక్కి వేఁడికొనియెద; వారలదెసఁ గోపంబు లేకుండవలయు; నట్లుం గాక నీకును గాంధారికిని వలయు పరలోకక్రియాకలాపంబులు వారయంద నిలిచెం గావున వారికి శుభంబు గోరుట లెస్స! మీ చిత్తంబు నొప్పించితి నని యెప్పాట దురపిల్లెడునో ధర్మజుతెఱం గెఱింగెదు గాక’ యని పల్కి గాంధారరాజనందన నుద్దేశించి. | 369 |
| ఉ. |
‘నీ కెన వచ్చు రాజరమణిన్ ధరనెందును గంటిమే? నృపా నీకము వించు నుండ సుతునిం దగు పల్కుల నంత యొత్తుదే? నా కది సిక్కెఁ జిత్తమున నాఁటి ప్రియం బగుచుండ నిప్పుడున్ లోకవిరుద్ధ వృత్తి చపలుం డితఁ డి మ్మెఱుఁగండ యేమియున్. |
370 |
| క. |
నీమాటకు దుర్యోధనుఁ | డామెయిఁ దాఁ ద్రుళ్ళిపడక యవుఁ గా కని నాఁ డే మేనిఁ గొంత యక్కట! భూమి యొసఁగెనేని యింత పుట్టదు సుమ్మీ! |
371 |
| వ. | కీడు వుట్టునని నీవు సెప్పితి; చెప్పిన మాటయుం దలకూడెఁ; బాండవులవలనం దప్పు లే దని యెఱుంగుదు గాదె! వారల కలుగ కుండునది; నీ వలిగి చూచినం ద్రిలోకంబులు భస్మీభూతంబు లగునట్టి తపఃప్రభావంబునం బ్రసిద్ధవు గావున నిన్నుం బ్రార్థించెద’ నని పల్కిన నద్దేవి ‘యది యంతయు నీ చెప్పినట్టిద’ యని వెండియు. | 372 |
| చ. |
‘విపులవిషాదతాపమున వేదన నొందు మదీయ బుద్ధి కుం దపగత మయ్యె నీదువచనామృతసేచనఁ జేసి యిట్టిచో నపరిమిత ప్రభావ! విను మంధుఁడు దీనుఁడు వృద్ధు నైన యీ నృపు నరయంగఁ బాండవులు నీవును యుక్తులు గారె! యెమ్మెయిన్.’ |
373 |
| వ. | అని పయిచీరచెఱంగు మొగంబున నదిమికొని యేడ్చినఁ గృష్ణుండు వివిధ వాక్యంబుల నద్దేవిం దేర్చి ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగాఁ బలికె; నట్టియెడ నశ్వత్థామ యుత్సాహం బమ్మహాత్మునకు హృదయగోచరం బగుటయు, దిగ్గన లేచి పారాశర్యు చరణంబులకు వినతుం డై యవ్విభునకుం బ్రణమిల్లి యతనితో నిట్లనియె. | 374 |
| క. |
‘గురుసుతుఁడు పాండవులకుం | గర మల్గును; వారిఁ బొదువఁగా నతఁ డీ ప్రొ ద్దురవడిఁ గదియును; బోయెద | దురపిల్లకుమయ్య మది విధూతకళంకా! |
375 |
| చ. |
అన విని రాజు దేవులు మురారికి నిట్లని ‘రెంతయున్ రయం బునఁ జనుమయ్య! పాండునృపపుత్రుల నెమ్మెయి నైనఁ గాచికోల్ వినుతి గదయ్య నీకు! నిను వేయి విధంబుల నాశ్రయించు టె ల్లను ఫల మొందఁ జేయఁగఁ దలంచుట పెంపు సుమయ్య కేశవా! |
376 |