| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| క. |
నీలపింగళ దేహమాభీల భంగి | కముగ నమ్మెయి వర్తించు జముఁడు సకల వృష్ణి భోజాంధకోత్సాది విహరణమున | మునుల శాపంబు ప్రేరేఁప మనుజనాథ! |
018 |
| సీ. |
చిలుకలు గూబల యెలుఁగుల చందంబు | దోఁపంగ నఱచు రాత్రులను దినము లందును నక్కల యట్లు మేఁకలు గూయు | మొదవు పిండునకు గాడిదలు పుట్టు; ముంగుల కుదయించు మూషికంబులు గుక్క | లెల్లను బిల్లుల నీను; బలుఁడు హరియును దక్కంగ యాదవ నివహంబు | బ్రాహ్మణప్రతతికి బాధసేయు |
|
| తే. |
గురుల కవమాన మొనరించుఁ దిరుగు లజ్జ | విడిచి యభిలాషముల వెంట విభుల పంపు సేయ కున్మార్గములఁ దమ చిత్తములకు | వచ్చినట్ల వర్తింతురు వనిత; లధిప! |
019 |
| క. |
అనలములు హోమకాలం | బున నానాభూతవర్ణములతోడ శిఖల్ మనుజేశ్వర! వామావ | ర్తన మొందఁగ నుగ్రగంధ రౌద్రంబు లగున్. |
020 |
| క. |
విను కూడుగూరపాకము | గనుఁగొని ప్రొయివాపి డింపఁగా నప్పు డసం జనితములై ప్రువ్వులు గల | గొన మిలమిల మెదలునందుఁ గురుకులముఖ్యా! |
021 |
| సీ. |
అనుదినంబును నిట్టు లశుభసూచకములు | దోఁపంగ సర్వవిదుండు కృష్ణుఁ డంతరంగమున సమాలోచనము చేసి | ‘గాంధారి పుత్రశోకమునఁ జేసి కోపంబు గదిరిన శాపంబు ముప్పది | యాఱవునేఁ డెల్ల యాదవులకు నాశ మన్యోన్యహననమున నగుటకు | నిచ్చె నిష్ఠించి; యయ్యేఁడు వచ్చెఁ |
|
| తే. |
దప్ప దది ఫలించు; దానికి తీర్థ స | మీప భూమియైన మేలుగాదె!’ యని నరేంద్ర! యమ్మహాత్ముఁ డీ భంగి నూ | హించి తెఱఁగు నిశ్చయించెఁ దివిరి. |
022 |
| ఆ. |
అట్లు నిశ్చయించి, యాదవ నివహక్ష | యంబు దివ్యబుద్ధి నరసి యపర దివసకలిత మగుటఁ దెల్లంబుగాఁ గని | కొని యతండు పెద్ద కొలువులోన. |
023 |
| ఉ. |
‘జాతర సేయఁగా వలయు సర్వజనంబులు నంబురాశికిన్ బ్రాతిగ భక్తితోడ’ నని బంధుల కెల్లను జెప్పి, వీట వి ఖ్యాతిగ నప్డు సాటుటకు నర్హునిఁ బంచిన ఘంటికాస్వనో పేతము గాఁగ వాఁ డెలమిఁ బెద్దయెలుంగునఁ జాటె నెల్లెడన్. |
024 |
| సీ. |
ఆ రేయిఁ గల నెల్లవారును గోరదౌ | డలును నల్లని మేను గల నెలంత యొక్కత యిలు సొచ్చి యువిదల నీడిచి | కొని పోవ శస్త్రాస్త్రకోటి కేతు చయమును భూషణ సమితియు రాక్షసు | లపహరింపఁగఁ గని రపరదినము నందగ్నిదత్తంబు నబ్జనాభంబును | నైన కృష్ణుని చక్ర మద్భుతముగ |
|
| ఆ. |
నెగసి యఖిలజనులు నీక్షింప దివమున | కరిగె; నమ్మహాత్ము గరుడకేత నంబుఁ దోన చనియె నరవర! రోహిణీ | తనయు తాటిసిడము ననుసరించె. |
025 |
| తే. |
వినుము సుగ్రీవమును శైబ్యమును వలాహ | కంబు మేఘపుష్పంబు నాఁ గలుగునట్టి వాహనంబులతోఁ గూడ వాసుదేవు | తేరు తదవసరంబున దివికి నరిగె. |
026 |
| క. |
‘వెడలుండు తీర్థయాత్రకుఁ | గడువేగం’ బనిరి సురలు గగనంబున న ప్పుడు సువ్యక్తముగా నె | క్కు డెలుంగులు సెలఁగ రాజకులమౌళిమణీ! |
027 |
| క. |
అవి గనియు వినియు నులుకక | సవరణ లొప్పార నపు డసంభ్రములై యా దవులు మనోజ్ఞములగు సీ | ధువులును మాంసములు వేడ్కతో నింటింటన్. |
028 |