| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
తదనంతరంబ యద్దామోదరుఁడు రాము | వదనసరోజంబువలన వెడలఁ గనియె మహాభుజంగము నరుణచ్ఛాయ | యై పొల్చు వక్త్రసహస్రకంబు మణుల వెలింగెడు ఫణములుఁ దెలుపారి | పర్వతాభోగ నిభంబు నైన మేని పెంపును గలదాని నట్లా బల | భద్రుండు నిజయోగబలముపేర్మిఁ |
|
| ఆ. |
దనదుతనువు విడిచి చనియె వియద్వీథి | నంబునిధికి నమ్మహాత్ము నెదురు కొనియె వరుణుఁ డధిక వినయంబుతో నాగ | కులము లెల్ల వచ్చి కొలిచె భక్తి. |
075 |
| ఆ. |
అహికులాగ్ర గణ్యుఁడైన వాసుకియుఁ గ | ర్కోటకుండుఁ దక్షకుండు వారు ణుండుఁ గుంజరుండునుం గుముదుండును | దుర్ముఖుండునుం బృథుశ్రవుండు. |
076 |
| తే. |
హ్రాదుఁడును వక్రదంతుండుఁ గ్రోధనామ | కుండు శంఖుండుఁ బుండరీకుండు మిశ్రి యును నజేయుండు ధృతరాష్ట్రుఁడును మొదలుగ | నరుగుదెంచిరి యద్దేవునర్థిఁ గొలువ. |
077 |
| తే. |
పరమకౌతుకంబు భవ్యభక్తియు నొల | యంగ వచ్చి కొలిచె నా ఫణీంద్రు గంగ యాది గాఁగఁ గల మహానదులు స | ముజ్జ్వలాభిరామమూర్తు లొంది. |
078 |
| క. |
అంతయును దివ్యదృష్టి | క్రాంతి యగు మురాంతకుండు గనుఁగొన నమ్మూ ర్త్యంతరము గలపికొనియె న | నంతుఁడు దన పరమమూర్తి యందు నరేంద్రా! |
079 |
| సీ. |
అ ట్లగ్రజుఁడు చన్న నచ్చటువాసి యం | తంతఁ గ్రుమ్మరుచు మురారి సకల లోకపాలనకు భూలోకంబునందుఁ దాఁ | బుట్టంగ వలసిన యట్టి మేటి పనులెల్లఁ దీఱుట మనమునఁ దలపోసి, | తనువిముక్తికి నిమిత్తంబుఁ దలఁచి, మునులవాక్యము తెఱంగును దొల్లి దుర్వాసు | నవయవసమితిఁ బాయసము పూయు |
|
| తే. |
నప్పు డఱకాలఁ బూయమి నత్తపస్వి | యచట నవిలంఘ్యమై యపాయంబు గలుగు ననిన మాటయుఁ జర్చించి, మనసు నింద్రి | యములు నడఁగించి గాఢసమాధి నొంది. |
080 |
| క. |
జలనిధిశయనుండు మహీ | స్థలశయనుం డయ్యె; నట్టి సమయమునం దా నలుకుచుఁ దత్కాంతార | స్థలి కల్లన నరుగుదెంచె జర కురుముఖ్యా! |
081 |
| ఆ. |
అరుగుదెంచి యచటఁ దిరిగెడు నొక వేఁట | కానిఁ గాంచి వాఁడు కమలనాభు నొడలు చూచి టెంకి నున్న యేణం బను | నట్లు సేసి మాయ యావహించె. |
082 |
| మ. |
ధరణీనాథ! యతండు శాతశర ముద్యద్వృత్తి సంధించి యు ద్ధురభంగిం దెగ నిండఁగాఁ దిగిచి యత్యుగ్రంబుగా నేసె; నా హరి శ్రీపాదతలంబుఁ దూరఁగొని యయ్యస్త్రంబు మీఁగాల ని ష్ఠుర వేగంబున నుచ్చిపోయె వెస వాఁడుం జేరెఁ గైకొంటకున్. |
083 |
| క. |
చేరి తెలియఁ గనుఁగొని పెం | పారు పురుషుఁ డగు టెఱింగి యత్యంతార్తిం గూరి వడఁకి తచ్చరణాం | భోరుహములఁ దన శిరంబు వొందం బడియెన్. |
084 |
| తే. |
పడి యేడ్చినఁ గృష్ణుఁడు తగు | నొడువుల నూరార్చి తన మనోరథ మిమ్మై నొడఁగూడిన మానుషమగు | నొడలు విడిచి నిజపదంబు నొందుట కరిగెన్. |
085 |