| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| ఉ. |
కావున వేగ మగ్నియును గాష్ఠములున్ సమకూర్చి సద్విధి శ్రీవిలసిల్లఁ గృష్ణుని శరీరము సంస్కృతిఁ గూర్చి క్రమ్మఱం బోవుట బుద్ధి’ యంచు మఱి భూసురకోటియుఁ దాను గాఢసం భావనతోడఁజేసె దృఢభక్తికుఁడై పితృమేధభద్రమున్. |
171 |
| చ. |
హలధరునిం దలంచి మునులాడిన మాట తెఱంగు దప్పదం చలయక తత్ప్రదేశమున నారసి కాంచి తదీయదేహమున్ వలయు తెఱంగునం బరమవహ్నికి నాహుతి సేసె నయ్యనా కులహృదయుండు భూమిసురకోటియుఁ దానును సత్వరంబుగన్. |
172 |
| సీ. |
అబ్భంగిఁ గృతకృత్యుఁ డైన యప్పార్థుండు | యాదవపురమున కరుగుచున్న యెడ ననుచరులతో నిట్టి కార్యంబును | నడపక తక్కిన నాథు చన్న గతికిఁ బోవుటకునై కడఁగెడు రుక్మిణీ | ప్రభృతుల మనకు నిల్పంగ వశమె? రే యెల్ల నిప్పని సేయు విధముల క | వ్యయ మగు నంతకు వచ్చు నబ్ధి |
|
| ఆ. |
మేలు సేయఁ బోయి యీ లోకమంతయుఁ | దిట్టునట్టి కీడు దెచ్చికొనఁగ వచ్చునే? స్వదేశవర్తులమై చూచి | కొంద మెల్లపనులు రండు వేగ. |
173 |
| తే. |
అనుచు నరిగి తాఁ దలఁచిన యట్ల యెల్ల | తెఱఁగు పనులు నా రాత్రిలోఁ దీర్చి ప్రొద్దు పొడుపునకు మున్న వెడలించెఁ బురము సకల | జనములను జీవధనముల సరకు నతఁడు. |
174 |
| సీ. |
అప్పుడు కృష్ణుని యంతఃపురాంగనా | జనము షోడశ సహస్రమ్ము నతని మహిషీజనుల రాముమహిళల నుచితవా | హనముల నిడికొని యర్హపురుషు లేతేరఁ దేరుల నేనుంగులను గుఱ్ఱ | ములను దత్పరిచారకులు ప్రయత్న మున సవరణ తోడఁ గొని రా నగరి సర | కులుఁ దదీయాధికారులు బహు ప్ర |
|
| ఆ. |
కారశకటములను గావళ్ళ నెత్తించి | యరసికొని కడంక నరుగుదేర విగతనాథ లైన మగువల గారాము | సెడక యుండునట్లు నడపికొనుచు. |
175 |
| క. |
విను వజ్రముఖ్య యాదవ | జనము నుచితవృత్తి నడపి సర్వంబున క య్యనఘుండు దాన దిక్కయి | చనియె నరదమునను మది విషాదము గదురన్. |
176 |
| క. |
ఇమ్మెయి నరుండు సకల జ | నమ్ము వెడల నినుఁడు పూర్వనగ మెక్కెను వే గమ్మున ముంచుకొనియె నగ | రమ్ము పయోరాశి భరతరాజవరేణ్యా! |
177 |