| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| క. |
వననిధి పురంబు ముంపఁగ | మనుజేశ్వర! యెల్లజనులు మరలఁబడి కనుం గొని రద్భుత రసపూరం | బునఁ బెన్నిట్టఁ దమ చిత్తములు మునుఁగంగన్. |
178 |
| తే. |
అపుడు రెండవ జలనిధి యనఁగఁ జాలి | యద్భుతోద్భూత వాక్యచయంబు పేర్మి మ్రోయు నా జనసంఘంబు మురవిరోధి | మఱఁది నడిపించె దర్శితమార్గుఁడగుచు |
179 |
| క. |
నడిపించి పంచవటమున | విడియించెను; వీడు చోరవీరులు గని ‘యె క్కుడు ధనములు గల వీ మ్రు | క్కడి ప్రజలో లేరు దీనిఁ గావఁగ యోధుల్. |
180 |
| క. |
కవ్వడి యొక్కఁడ కంటిరె? జివ్వనఁ జేరుద మితండు సేడ్పడఁ గా నిం దెవ్వరుఁ గడంగ లే రివి | ద్రెవ్విపడిన ధనము లెఱిఁగితిమి లోఁతెల్లన్.’ |
181 |
| క. |
అని వా రొండురువులతో | మనముల నుత్సాహ మెసఁగ మానితధనముల్ గొను నగ్గలికం బలుకుచు | ననేక బలకోటులగుట నలుకేది వడిన్. |
182 |
| క. |
‘బాలురు వృద్ధులుఁ జుండీ | యాలమునకుఁ గడఁగ నొక్కఁ డయినను లేఁడీ స్త్రీలం బొదువుద మనుచును | నేల యవిసి మూఁగినట్లు నిర్భరభంగిన్. |
183 |
| క. |
ఏ పెసఁగ రేఁగి యట్ల | ప్పాపాత్మక మగు కిరాతబలము సమగ్రా టోపమునఁ గవిసి వివిధ ధ | నాపహరణ మాచరింప నారంభించెన్. |
184 |