| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరాకేలనయ్య రామ |
| సామ - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| పరాకేలనయ్య రామ పరాత్పర నీకింత॥ |
| అనుపల్లవి: |
| ధరాసుతారమణ సకల చరాచరాధార నీకు॥ |
| చరణము(లు): |
| పరమభక్తితోను నీదు స్మరణ భజన సేయలేదు పరమదురాచారులైన నరుల జేరి మరచితి నిన్ను॥ |
| శరణ జనాధారుడైన పరమ పురుష వాసుదేవ నిరుపమ గుణ నీరజాక్ష వరము లొసగి బ్రోవవయ్య॥ |