| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర |
| తోడి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరాత్పర రఘువర నిన్ను నెరనమ్మితిర పరమదయాకర సరోజభవముఖ సురేహితార్థద గిరీశ సురుచిర శరాసమదహర॥ |
| అనుపల్లవి: |
| శిరీష సన్నిభ శరీరశోభిత ధర్మాత్మజా మనోహర నరేంద్ర దశరథ సుకుమార నన్ను మరవకుర ఇంతపరాకేలర॥ |
| చరణము(లు): |
| నీవేగతిగాద నీదయలేద శ్రీవాసుదేవ దేవాదిదేవ భవనుత మహానుభావామిత విభవ॥ |
| ఈవేళ నామొరలను వినరాద మునిజననుతపాద రావణాదిరిపుమథన రక్షిత భువన పవనతనయ నిత్యానందద॥ |