| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీకేల దయరాదు రామచంద్ర |
| కథనకుతూహల - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీకేల దయరాదు రామచంద్ర నిన్నే నమ్మలేద భక్తవత్సల॥ |
| అనుపల్లవి: |
| రాకేందు నిభానన జానకీశ సాకేత పురాధీశ సర్వేశ॥ |
| చరణము(లు): |
| నిగమార్థసార నిత్య నిర్వికార నగరాజధర అనంతావతార॥ |
| యోగీశ్వర శ్రీధర వాసుదేవ పగలురేయి నిన్నే పొగడుచుండగ॥ |