| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శివేపాహి శ్రీచాముండేశ్వరి |
| సురటి - ఖండ త్రిపుట |
| పల్లవి: |
| శివేపాహి శ్రీచాముండేశ్వరి శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి॥ |
| అనుపల్లవి: |
| నివారిత నిజభక్త పాపనిచయే నిఖిలాగమవేద్య మహిమాతిశయే॥ |
| చరణము(లు): |
| పావనయదుకుల భాగ్యదేవతే పరమపురుష వాసుదేవ సహజాతే॥ |
| భావుక ఫలదాయిని సుమమణిమాలిని దేవాది సకలలోక పరిపాలిని॥ |
| కోవిదహృదయ వికాసిని కల్యాణి కాత్యాయని మహిషాసుర మర్దిని దేవి శ్రీమజ్జయచామరాజేంద్ర కామితదాయిని॥ |