| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కురుమే కుశలం కుంజరగమనే |
| కమలామనోహరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కురుమే కుశలం కుంజరగమనే కుందరదనే కుంజరనుత హరిమానస సదనే॥ |
| అనుపల్లవి: |
| కురంగనయనే కోకిలగదనే కుంభసంభవాది సన్నుతచరణే కరుణారసపూర్ణే కమనీయ వదనే కనక నూపురయుత చరణే॥ |
| చరణము(లు): |
| పరమేశ్వర సంస్తుత జగదీశ్వర పరవాసుదేవాతిశయ హృత్సుఖకరి పరమేష్ట్యాది సురానందకరి పరమాద్భుత జగల్లీలా లహరి పరతత్త్వ ప్రతిపాదిత పరమ పురుషార్థసాధన సంపత్ప్రదానకరి॥ |