| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 132. అథోగతి |
| 132. అథోగతి |
| అమావాస్య రాత్రి నాకాశమ్మునుండి చంద్రకళ తళతళా జారెను భువికి |
| మలమల మాడ్చెడు మధ్యాహ్నవేళ కన్నెరోజా విచ్చి కంపలో బడియె. |
| కానికాలమ్మున కన్నె చపలతను బాల కుల్కుచు పాపపంకాన దిగియె. |
| అరసికులకు కవితాదాన మిచ్చి కవికోకిలమ్ము మృత్యుగహనమ్ము జొచ్చె. |