| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 131. మరణావస్థ |
| 131. మరణావస్థ |
| అలలు ఘోరముగ లేచెడు స్వామీ కలగుచున్నదే మహాసముద్రము! |
| ఇటుగాంచ మహాప్రళయమ్మే అటుగాంచ మహాప్రళయమ్మే ఎటుగాంచుటయును ఈ నాకన్నుల మటుమాయ గప్పనంతవరకెగా? అలలు... |
| జ్వాలలు పైపై లేచెడు దేవా కాలానలమిదె నోరు విప్పెడిని! |
| ఈ దిశ ఘోరదవానలమే ఆ దిశ ఘోరదవానలమే ఏదిశ బోవుటయైన నాతనువు బూదిగాక నున్నంతవరకెగా జ్వాల... |
| కూలెడు కూలెడు కొండలు స్వామీ వ్రాలుచుండె నాతలపై మిన్నులు! |
| తల పైకెత్తిన నంతమ్మే తల నిటువంచిన నంతమ్మే తల నెత్తుటయును దించుటయును నే నలిగి హతము గానంతవరకెగా కూలె... |
| అలలు ఘోరముగ లేచెడు స్వామీ కలగుచున్నదే మహాసముద్రము! |