| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
నగ్న గీతాలు |
| నగ్న గీతాలు (భారతి - సెప్టెంబరు 1941) |
|
-- ౧ -- సరికొత్త శరీరంలో నెత్తురు పాడిన పాటకు నగ్నశోభ నందన వనమై పూచింది |
|
అవలోకిస్తే అవినీతని బుద్ధులుచెప్పే బుద్ధికికాదు; కన్నులనిండే అందంకోసం కళవళపడు డెందాలకె! చూపులతో అందుకోండి! |
|
అదేమిటి? పండ్లరుచి తెలిసికూడా పచ్చికాయలు రాల్చుకుంటూ పారిపోయే ఉడుత సరదా! |
|
వారెవరు? ఏదో కీచకభావం నా సైరంధ్రీ గీతాన్నే చెరబడితే చూస్తూ ఊరుకొనే నా రక్తం ధర్మరాజు! |
|
ప్రేమ స్త్రీ పురుష కామహోమంలో పాణింధమము ప్రేమ! |
|
-- ౨ -- నా హృదయం అద్దం అయితే నా భావం ప్రతిబింబిస్తే ఉడుకుబోతు నా రక్తం 'హఁ' అంటే మసకమసక మాలిన్యం నా గీతం! ఎందుకో ఎండావానా మగడు పెళ్లాం జగడమాడితె కయ్యానికి కాలుజాచు కొమ్మలు పూవులు కిలకిల నవ్వితే నా మీదెందుకు ఈ పర్జన్యం గర్జిస్తుంది |
|
జగమంతా కన్నయితే చీకటి కజ్జలమైతే నా గీతం చూపు! |
|
నీవు ప్రేమ ఈ ప్రపంచ వైతరణి దాటేందుకు నీ కోసం నే చేసిన గోదానం నా గీతం!! |