| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
నిశాగీతి |
| నిశాగీతి |
|
కళ్ళల్లో కర్పూరం జల్లినట్టు పన్నీరే పోసినట్టు భగ్గని మండించి చల్లగ తోచావు ఈ నీలి నిశలోన నా పునుగు ఎదలోన |
|
హృదయానికి వలపే లేదు నయనాలకు చూపే లేదు |
|
అంధుని కనురెప్పలపై కన్నీరు నా గీతం! |
|
పెండ్లి పీటై పుడమి పులకరించింది వ్యోమమార్గం హోమగుండం ధూమ మెగజిమ్మెన్ |
|
దోయిలించిన తలంబ్రాల చేతుల నిశా నీలహస్తాలను ఖండించే ఉదయ సంధ్య |
|
నిశయన నింతే! వలపన నంతే! |