| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
రక్షణ మందిరం |
| రక్షణ మందిరం |
|
గాలికి ఊగే తెరచాపై కదిలింది రెక్కలు విప్పింది ఎవరో బంధించిన ఎముకల పంజరమ్ములో ఆత్మ ఎగరాలని |
|
హేమంత శర్వరీ కురులు ఇరులు మంతన మాడాయి పాతాళమ్మున బలి ప్రభృతుల చూపుల నీలిమ లోని లోతులను కలిచింది. |
|
కట్టు తెగిన కాలభైరవుడు గాలి పండుటాకుల మ్రోడుటాశల మరణ శయ్యనె పరిచాడు క్రొత్తసృష్టికే పిలిచాడు |
|
జీవితాంతపు వెలుగులు కాంతి గోళములు కమ్మని మృత్యు పరీమళము రమ్మని పిలిచాయి |
|
వేడితగ్గిన రక్త పురాణ అస్థులు ఏటికి నీ వలపంత? రక్షణమందిర మంటావు? రాను! పొమ్మన మంటావు? |